అజయ్ భూపతి.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు

ఇక అజయ్ భూపతి ఈ కొత్త సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుండగా, దాదాపు 30-40 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

Update: 2024-10-17 13:37 GMT

దర్శకుడు అజయ్ భూపతి, తన కెరీర్‌ను ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో సాలీడ్ గా స్టార్ట్ చేసినా ఆ తర్వాత వచ్చిన ‘మహా సముద్రం’తో ఒక్కసారిగా డౌన్ అయ్యాడు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో, ఆయనపై వచ్చిన క్రేజ్ కాస్త తగ్గిపోయింది. అయినప్పటికీ, అజయ్ తన సృజనాత్మకతను ఎప్పటికప్పుడు చాటి చెప్తూ, కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ జోరు పెంచుకున్న అజయ్, ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు కసరత్తులు మొదలుపెట్టాడు.

అతని తదుపరి ప్రాజెక్ట్‌పై చాలా రోజులుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. నిజానికి విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో సినిమా చేయాలనే ఆలోచనతో కథను సిద్ధం చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయినట్లు తెలుస్తోంది. తాను అనుకున్న కాంబినేషన్ సెట్ కాకపోయినా, అజయ్ భూపతి తన కసరత్తులను ఆపకుండా కొత్త హీరోల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా, అజయ్ భూపతి ఇప్పుడు కొత్త హీరో విరాట్ కర్ణతో ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను యాక్షన్‌ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందించాలని అజయ్ నిర్ణయించాడని టాక్. ధృవ్‌తో చేయాల్సిన కథను విరాట్‌కు చెప్పి ఒప్పించినట్లు పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. 'పెదకాపు’ చిత్రం ద్వారా పరిచయం అయినా విరాట్‌కి ఇది మరో మంచి అవకాశం. తొలి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, హీరోగా తన ప్రతిభను నిరూపించుకునే మరో ఛాన్స్ గా ఈ సినిమాను చూస్తున్నాడు.

‘కర్ణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం, ఈ సినిమా త్వరలోనే అధికారికంగా ప్రకటించబడే అవకాశముంది. ఇక అజయ్ భూపతి ఈ కొత్త సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుండగా, దాదాపు 30-40 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దీపావళి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘కర్ణ’ కథనం మొత్తం యాక్షన్ ప్రధానంగా ఉండడంతో, ఈ సినిమా అజయ్ భూపతికి మరో మంచి హిట్‌ను అందించే అవకాశముంది.

విరాట్‌ రీసెంట్ గా నిర్మాత అభిషేక్ దర్శకత్వంలో ‘నాగబంధం’ సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందట. ఇవే కాకుండా, మరో రెండు క‌థ‌ల‌కు కూడా విరాట్‌ క‌ర్ణ ఓకే చెప్పినట్లు సమాచారం. వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News