దక్షిణాది హీరోయిన్లతో హిందీ హీరో ఆట
ఈ అగ్ర హీరో తన ప్రతి చిత్రంలోను దక్షిణాది కథానాయికకు అవకాశం కల్పిస్తున్నాడు.;
అతడు ఇటీవలి కాలంలో నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ అగ్ర హీరో తన ప్రతి చిత్రంలోను దక్షిణాది కథానాయికకు అవకాశం కల్పిస్తున్నాడు. అందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి కథానాయికలకు అవకాశమివ్వడం చర్చగా మారింది. 55వయసు ముదురు హీరో సరసన రకుల్ బ్యాక్ టు బ్యాక్ అవకాశాల్ని అందుకోవడం చర్చగా మారింది. పైగా ఏజ్డ్ హీరోతో రొమాన్స్ చేసే యువనటిగా 33ఏళ్ల రకుల్ గురించి చాలామంది గుసగుసలాడారు.
అంతేకాదు.. అతడు నటిస్తున్న బోల్డ్ మూవీ సీక్వెల్ లోను రకుల్ కి అవకాశం కల్పించాడు. ఇంతలోనే ఇప్పుడు మరో దక్షిణాది హీరోయిన్ తో అతడు రొమాన్స్ కి రెడీ అయ్యాడు. సౌత్ క్వీన్స్ పై ఆధారపడుతున్న ఈ హీరో ఎవరో కాదు.. హిందీ యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్. ప్రస్తుతం అతడు రేంజర్ అనే అడవి నేపథ్యంలోని సినిమాకి సన్నాహకాల్లో ఉన్నాడు. మిషన్ మంగళ్ ఫేం జగన్ శక్తి ఈ చిత్రానికి దర్శకుడు. అతడు మరో యాక్షన్ ప్యాక్డ్ కథను ఒప్పించి దేవగన్ తో సెట్స్ పైకి వెళుతున్నాడు.
రేంజర్ లో అజయ్ దేవ్‌గన్ అంకితభావంతో కూడిన అటవీ అధికారి రేంజర్ సింగ్ పాత్రను పోషిస్తున్నాడు. అతడు జంతువులను వేటాడే ప్రమాదకర మనుషులతో ముప్పును ఎదుర్కొనే సిన్సియర్ అధికారిగా ఇందులో కనిపిస్తాడు. ఇందులో సంజయ్ దత్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ తో దత్ అదరగొడతారని టాక్ ఉంది. అయితే ఇందులో దక్షిణాది అగ్ర కథానాయిక తమన్నా ఎలాంటి పాత్రలో నటిస్తుంది? అనేదానిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది. తమన్నా గతంలో హిమ్మత్ వాలా, భోళా లాంటి చిత్రాల్లో దేవగన్ సరసన నటించింది. ఇప్పుడు మూడోసారి కథానాయికగా నటిస్తుంది. కానీ తన పాత్ర పరిధి ఏ మేరకు పని చేస్తుందో వేచి చూడాలి. తన వయసులో ఆల్మోస్ట్ సగం ఉన్న హీరోయిన్లతో దేవగన్ రొమాన్స్ చేస్తుండడం కూడా హాట్ టాపిగ్గా మారింది. 35ఏళ్ల తమన్నా విజయ్ వర్మ నుంచి బ్రేకప్ అయ్యాక దేవగన్ లాంటి సీనియర్ తో నటించాలని డిసైడ్ కావడం చర్చగా మారింది.
రేంజర్ మార్చి 2025 చివరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2026లో విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. `పుష్ప` ఫ్రాంఛైజీ సంచలన విజయం తర్వాత పచ్చని అడవి నేపథ్యంలో సినిమా తీయాలని దేవగన్ ఉవ్విళ్లూరుతుండడం, ఈ ప్రాజెక్టులో పాన్ ఇండియా మిల్కీ బ్యూటీ తమన్నాకు ఛాన్సివ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు బోల్డ్ సీక్వెల్ దేదే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ కి అవకాశం కల్పించాడు దేవగన్. దక్షిణాది బ్యూటీలతో అతడి ఆట ఏమేరకు వర్కవుటవుతుందో వేచి చూడాలి.