మంగళవారం డైరెక్టర్ ఏమయ్యాడు?
ఈ మూవీ తర్వాత అజయ్ భూపతి నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. మంగళవారం రిలీజ్ అయ్యి 6 నెలలకి పైగా అవుతోన్న ఇప్పటి వరకు కొత్త సినిమాపై అజయ్ భూపతి క్లారిటీ ఇవ్వలేదు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. 2.5 కోట్ల బడ్జెట్ తో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 12 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. యూత్ ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరించారు. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతోనే యాక్టర్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని వరుస అవకాశాలు దక్కించుకుంది. కార్తికేయ కూడా హీరోగా నిలబడటానికి ఈ సినిమా బలంగా ఉపయోగపడింది.
తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని అజయ్ భూపతి ఇద్దరు స్టార్ హీరోలతో మహాసముద్రం మూవీ చేశాడు. శర్వానంద్, సిద్ధార్ద్ హీరోలుగా చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఎఫెక్ట్ అతనిపై పడింది. దీంతో మూడో సినిమా కోసం అజయ్ భూపతి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ తన మొదటి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో 20 కోట్ల బడ్జెట్ తో మంగళవారం మూవీ చేశారు.
ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి బ్యాక్ టూ ఫామ్ అని అందరూ చెప్పుకొచ్చారు. అయితే వరల్డ్ కప్ ఇంపాక్ట్ ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది. ఈ మూవీ తర్వాత అజయ్ భూపతి నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. మంగళవారం రిలీజ్ అయ్యి 6 నెలలకి పైగా అవుతోన్న ఇప్పటి వరకు కొత్త సినిమాపై అజయ్ భూపతి క్లారిటీ ఇవ్వలేదు.
ఆ మధ్య కార్తికేయతో ఓ మూవీ చేయనున్నట్లు టాక్ బయటకొచ్చింది. కార్తికేయ సొంతం ప్రొడక్షన్ లోనే ఆ సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అజయ్ భూపతి నెక్స్ట్ సినిమాపై ఎప్పుడు అప్డేట్ ఇస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి చేయబోయే మూవీ విషయంలో అజయ్ భూపతి మరింత జాగ్రత్తగా ఉన్నాడని టాక్.
ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కథతోనే మళ్ళీ ప్రేక్షకులని పలకరించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇంత సైలెంట్ గా ఉన్నాడు అంటే మంచి కథ సిద్ధం చేసే పనిలో ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అలాగే ఆ మధ్య ఒక బిగ్ ఫ్యామిలీ హీరోతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. మరి అజయ్ భూపతి ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.