స్కాట్లాండ్ లో మృణాల్ ఇంటిమేట్ సీన్స్!

ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-07-03 12:30 GMT

ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టి. న‌టిగా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `క‌ల్కి 2898` పాన్ ఇండియా చిత్రంలోనూ న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస లందుకుంది. క‌నిపించింది కాసేపే అయినా పాన్ ఇండియాని లో ఓ ఐడెంటీటిని సంపాదించింది.

ఇంకా మ‌రెన్నో తెలుగు సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ చిత్రాలు అంతే వేగంగా పూర్తి చేస్తోంది. ఇట‌వ‌లే `స‌న్నాప్ స‌ర్దార్ -2` కి కూడా సైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్‌-సంజ‌య్ ద‌త్ లు హీరోల‌గా న‌టిస్తున్నారు. మ‌ళ్లీ జ‌స్సీ సింగ్..బిల్లు సింగ్ పాత్ర‌ల్లో ఆ ఇద్ద‌రు మెప్పించ‌బోతున్నారు. ఈనెల‌ఖ‌రు నుంచి షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. అయితే తొలి షెడ్యూల్ లోనే మృణాల్ -అజ‌య్ దేవ‌గ‌ణ్ పై సినిమాకి కీల‌క‌మైన రొమాంటిక్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారుట‌.

ఇవ‌న్నీ స్కాంట్లాడ్ లో చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. దీనిలో భాగంగా ఇద్ద‌రి మ‌ధ్య ఇంటిమేట్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ని తెలిసింది. అంద‌మైన స్కాట్లాండ్ లొకేష‌న్లో వాటిని షూట్ చేస్తే మ‌రింత అందంగా ప్రొజెక్ట్ చేయోచ్చు అన్న‌ది మేక‌ర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. రొమాంటిక్ స‌న్నివేశాలు మృణాల్ కి కొత్తేం కాదు. అమ్మ‌డు సీన్ డిమాండ్ చేసిందంటే? త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.

పూర్తిగా ద‌ర్శ‌కుల హీరోయ‌న్ గా ప‌నిచేస్తుంది. న‌టిగా అంత‌గా ప‌రిణితి చెంద‌డానికి కార‌ణం కూడా త‌న పాత్ర‌లేన‌ని ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పింది. తాజాగా ఈసారి ఏకంగా సీనియ‌ర్ హీరోతోనే రొమాన్స్ కి సై అంటోంది. మ‌రి స్కాంట్లాండ్ అందాల్లో ఆ స‌న్నివేశాలు ఎంతగా హీటెక్కిస్తాయో చూడాలి.

Tags:    

Similar News

eac