సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండి..!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూ విలన్ గా తన ప్రత్యేకతని చాటుతూ వస్తున్న అజయ్ ఘోష్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి.

Update: 2024-06-13 04:04 GMT

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూ విలన్ గా తన ప్రత్యేకతని చాటుతూ వస్తున్న అజయ్ ఘోష్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా జూన్ 14న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యువ నిర్మాత ధీరజ్, దర్శకుడు సాయి రాజేష్ చీఫ్ గెస్టులుగా వచ్చిన ఈ వేడుకలో మ్యూజిక్ షాప్ మూర్తి లీడ్ రోల్ చేసిన అజయ్ ఘోష్ స్పీచ్ అందరిని ఉత్సాహపరిచింది.

మైక్ అందుకున్న అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. చిన్న సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన మనసున్న మారాజులు సాయి రాజేష్, ధీరజ్ లు అన్నారు. చిన్నోడే కానీ లేకపోతే ధీరజ్ కాళ్లకు దండం పెట్టేవాడిని అన్నారు అజయ్ ఘోష్. ఇక ఈ సినిమాలో జీవితం ఉంటుందని.. మనం ఏమవ్వాలనుకున్నాం.. ఏమయ్యాం అని కుమిలిపోతుంటాం.. ఈ సినిమా అలాంటి వారికి స్పూర్తి ఇస్తుంది. మ్యూజిక్ షాప్ మూర్తి కథ మూర్తి అంజన వారి చుట్టూ సమాజం ఎలా ఉంటుంది అన్నది టోటల్ గా ఈ సినిమాలో జీవితం ఉంటుందని అన్నారు అజయ్ ఘోష్.

ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహం వస్తుంది. ఎక్కడో అమెరికాలో బిజినెస్ చేసుకుంటూ ఈ కథ రాయడం గొప్ప విషయం ఈ సినిమా కోసం రెండున్నర ఏళ్లు కష్టపడ్డాడు దర్శకుడు శివ పాలడుగు. ఇక్కడ కచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతోనే జత బట్టలు పట్టుకుని వచ్చా.. అంత దమ్ము ఉంది కాబట్టే నిలబడగలిగాను. మనకు తోడైన వారిని బట్టే కెరీర్ ఉంటుందని అన్నారు అజయ్ ఘోష్. అంతేకాదు తన భార్య ఇచ్చిన సపోర్ట్ కూడా చెప్పుకొచ్చారు అజయ్ ఘోష్.

మ్యూజిక్ షాప్ మూర్తి అందరు చూడాల్సిన సినిమా అని.. వందల కోట్ల సినిమాను ఆదరించినట్టే కంటెంట్ ఉన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అంత గొప్ప సంస్కార వంతులు మన ఆడియన్స్. అందుకే ప్రజలకు మించిన దేవెళ్లు లేరని అంటారు. అందుకే అలాంటి వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ఒకవేళ సినిమా నచ్చకపోతే తన నెంబర్ కి కాల్ చేసి బూతులు తిట్టండి అని నెంబర్ ఇచ్చారు అజయ్ ఘోష్. ఈ సినిమాలో ప్రతి మనిషి జీవితం ఉంటుంది. చేతులెత్తి ప్రార్ధిస్తున్నా 14న న రిలీజ్ అవుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను ఆదరించండని అనారు. చాందిని చౌదరి గురించి చెబుతూ ఇలాంటి హీరోయిన్ తెలుగు సినిమాల్లో ఉన్నందుకు గర్వపడాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారిని కాకుండా మన వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఈ అమ్మాయికి సరైన అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తుందని అన్నారు అజయ్ ఘోష్.

చివరగా మంచి ప్రయత్నంతో వస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తిని మీ అందరు ఆశీర్వద్స్తారని కోరుకుంటున్నా అని స్పీచ్ ముగించారు.

Tags:    

Similar News