అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ చూశారా? టాక్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా పట్టుదల సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఆయన.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ కొడదామని చూస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించారు.
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. టీ సిరీస్ గుల్షన్, భూషణ్ సమర్పణలో నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో మేకర్స్.. ఇప్పుడు అదే జోష్ తో రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
కొందరు అజిత్ కెరీర్ లో GBU ట్రైలర్ ది బెస్ట్ అని అంటుంటే.. ఇంకొందరు బాలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మంచి జోష్ తో ఉన్న మ్యూజిక్ తో గ్లింప్స్ స్టార్ట్ అవ్వగా అజిత్ క్రేజీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత త్రిష, సిమ్రాన్, ప్రియా ప్రకాష్, సునీల్, జాకీ ష్రాఫ్, ప్రసన్న, ప్రభు, యోగి బాబు తదితరులను పరిచయం చేశారు మేకర్స్. సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది.
అయితే అజిత్ ను వివిధ గెటప్స్, డిఫరెంట్ లుక్స్ లో చూపించారు మేకర్స్. అటు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. ఇటు స్టైలిష్ లుక్ లో హీరోను చూపించి అందరినీ ఫిదా చేశారని చెప్పాలి. సినిమాలో అజిత్ విభిన్న పాత్రలు చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లే అజిత్ రోల్స్ ఉండనున్నాయని అర్థమవుతోంది. దీంతో అజిత్ ఈజ్ బ్యాక్ అని చెప్పవచ్చు. త్రిష మరోసారి అదరగొట్టినట్లు కనిపిస్తోంది. విజువల్స్ అయితే వేరే లెవెల్. చాలా బాగున్నాయని చెప్పాలి.
జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రైలర్ కు మెయిన్ అసెట్ గా నిలిచింది. నిర్మాణ విలువల గురించి అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తన బ్రాండ్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. అయితే ఓవరాల్ గా ట్రైలర్ బాగుందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సినిమా హిట్ అని అంటున్నారు. మరికొందరు ట్రైలర్ మాష్ అప్ లా అనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అటు పాజిటివ్ అండ్ నెగిటివ్ టాక్ రెండూ వస్తున్నాయి. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.