సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో

ఇప్పుడు సంక్రాంతి నుంచి ఆ సినిమా తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి.

Update: 2024-11-25 06:30 GMT

2025 సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ నుంచి రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్‌, నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'డాకు మహారాజ్‌', వెంకటేష్, అనిల్‌ రావిపూడి కాంబోలో రూపొందుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్‌ నుంచి అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్‌ బ్యాడ్ అగ్లీ సినిమా సైతం సంక్రాంతికి రాబోతుందని ప్రకటన వచ్చింది. ఈ ఏడాది దసరాకు రావాల్సిన అజిత్‌ సినిమాను సంక్రాంతికి వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి నుంచి ఆ సినిమా తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి.

దసరా, దీపావళి బరి నుంచి తప్పుకున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ మూవీ 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ నుంచి విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది. అజిత్‌తో తాము తీస్తున్న సినిమా షూటింగ్‌ ఇంకాస్త బ్యాలన్స్ ఉందని, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రావడం సాధ్యం అయ్యే పని కాదని చెప్పుకొచ్చారు. చెన్నైలో జరిగిన పుష్ప 2 వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరు 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సినిమా విషయమై స్పందించారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించినట్లు ప్రకటించారు.

మైత్రి మూవీ మేకర్స్ తెలుగు లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు తీయడం జరిగింది. ఇప్పుడు వారి దృష్టి బాలీవుడ్‌, కోలీవుడ్‌పై ఉంది. కోలీవుడ్‌లో అజిత్‌తో ఇప్పటికే ఈ సినిమాను షురూ చేసిన మైత్రి వారు కొన్ని కారణాల వల్ల చాలా లేట్‌ చేస్తున్నారు. అజిత్‌ ఏ సినిమా అయినా చాలా స్పీడ్‌గా చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరుగుతుందని, అందుకే ఆలస్యం అవుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తమిళ్‌ సినీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం మైత్రి వారి సినిమా కావడంతో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

సంక్రాంతికి ఉన్న పోటీ నేపథ్యంలో తప్పుకున్నారా లేదంటే షూటింగ్‌ ఆలస్యం కారణంగా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారా అనే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వారు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తమిళ్‌ లో పెద్దగా పోటీ లేని కారణంగా సంక్రాంతికి అక్కడ విడుదల అయితే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కచ్చితంగా జీరో స్థాయిలో వసూళ్లు ఉంటాయి. అందుకే సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో విడుదల సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో మొత్తంగా మైత్రి వారు వాయిదా వేసి ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News