స్టార్‌ హీరో సినిమాకు చాలా సెన్సార్‌ కట్స్‌!

తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్ త్వరలో 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.;

Update: 2025-04-08 11:06 GMT
Ajith Kumar Good Bad ugly Censor Done

తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్ త్వరలో 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 10న పరేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేశారు. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలకు యూ/ఎ సర్టిఫికెట్‌ రావడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకు సైతం అదే సర్టిఫికెట్‌ వచ్చింది. కానీ సెన్సార్‌ సమయంలో పలు కట్స్ చెప్పడంతో పాటు, కొన్ని విషయాలపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలంటూ బోర్డ్‌ సభ్యులు కోరినట్లు సమాచారం అందుతోంది.


తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి సెన్సార్‌ బోర్డ్‌ దాదాపుగా 2 నిమిషాల 5 సెకన్ల ఫుటేజ్‌ను తొలగించింది. అంతే కాకుండా సిగరెట్లను ఉపయోగించే సన్నివేశాల క్లోజప్‌ షాట్స్‌ను తొలగించారు. దాంతో పాటు కొన్ని లాంగ్ షాట్స్‌ను సిగరెట్‌ షాట్స్‌ను వినియోగిస్తే అక్కడ డిస్కైమర్‌లను వేయడం జరిగింది. అంతే కాకుండా కొన్ని హింసాత్మక సన్నివేశాల సమయంలో రక్తం కనిపించే చోట బ్లర్‌ను వినియోగించాలని సూచించారు. ఇక సినిమాలోని కీలకమైన సన్నివేశంలో పాత సినిమాల పాటలను వినియోగించారు. ఆ పాటలకు సంబంధించి ఆయా సినిమాల నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్‌ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను తీసుకు రావాలని కోరడం జరిగిందట.

అజిత్ సినిమా కావడంతో పాటు, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సెన్సార్ కట్స్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా టోటల్ రన్‌ టైమ్‌ 2 గంటల 19 నిమిషాలుగా తెలుస్తోంది. సాధారణంగా ఈమధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు ఎక్కువ శాతం 2 గంటల 30 నిమిషాలకు అటు ఇటు గా ఉంటున్న విషయం తెల్సిందే. కానీ అజిత్ సినిమా సగటు నిడివితో పోల్చితే 10 నిమిషాలు తక్కువ నిడివితో వస్తుంది. అందుకే ఈ సినిమా మరింత ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రతిసారి మాదిరిగానే ఈ సినిమాకు సైతం అజిత్ ప్రమోషన్‌కి హాజరు కావడం లేదు. తమిళ్‌లో అంతంత మాత్రంగానే ప్రమోషన్ చేస్తున్న మేకర్స్‌ ఈ సినిమాను తెలుగులో అసలు విడుదల చేస్తున్నారా లేదా అన్నట్లుగా పరిస్థితి ఉందని కొందరు అంటున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు తమకు ఉన్న మేరకు అత్యధిక స్క్రీన్స్‌ లో తెలుగులో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాను విడుదల చేస్తున్నారు. భారీ ఎత్తున ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మేకర్స్‌ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అజిత్‌ సినిమా అంటే మినిమం ఉంటుంది. కనుక ఈ సినిమా ఖచ్చితంగా భారీ వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News