అజిత్ రేసింగ్ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఇదా!
తల అజిత్ కోలీవుడ్ లో ఎంత పెద్ద హీరో అన్నది చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోనూ అతడి సినిమాలకు ప్రత్యేక మైన క్రేజ్ ఉంది.
తల అజిత్ కోలీవుడ్ లో ఎంత పెద్ద హీరో అన్నది చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోనూ అతడి సినిమాలకు ప్రత్యేక మైన క్రేజ్ ఉంది. సౌత్ లో ఇతర భాషల్లోనూ అజిత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇంకా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టలేదు. కానీ అతడి ఛరిష్మా తో యూనివర్శల్ అప్పిల్ ఉన్న కాన్సెప్ట్ తో సినిమా చేయడం పెద్ద విషయం కాదు. అయితే సినిమాలతో పాటు, అజిత్ కార్ రేసింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
ప్రపంచంలో జరిగే వివిధ కార్ రేసింగ్ పోటీల్లో అతడి టీమ్ పాల్గొంటుంది. ఇటీవల జరిగిన దుబాయ్ రేసింగ్ లోనే అజిత్ టీమ్ గెలిచింది. అయితే ప్రాక్టీస్ లో భాగంగా అజిత్ తృటిలో ప్రమాదం నుంచి తప్పుకోవడం..అటుపై రేసింగ్ కి దూరమవుతున్నట్లు అతడు ప్రకటించడం సంచలనమైన సంగతి తెలిసిందే. కుటుంబం, అభిమానుల కోసం అజిత్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే అసలు సంగతి అది కాదని...ఇదీ అంటూ మరో వార్త తెరపైకి వస్తోంది.
ఒకేసారి మల్టీటాస్కింగ్ కాన్సెప్ట్ జోలికి వెళ్లకపోతేనే మంచిదని అజిత్ అన్నారు. రెండు పడవల ప్రయాణం అన్నది అంత సులభం కాదని శారీరకంగానూ, మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇకపై పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడుతాను అన్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో అజిత్ ఇకపై పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియాని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్, విజయ్, సూర్య లు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసారు. తాజాగా ఇప్పుడు వాళ్ల సరసన అజిత్ కూడా చేరబోతున్నారు. ఆయన నటించిన సినిమాలు జనవరి లో ఒకటి, ఏప్రిల్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.