ఓటీటీలోకి వచ్చేసిన విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే?
తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాల కోసం అటు తమిళ ఆడియన్స్ తో పాటూ ఇటు తెలుగు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు.;
తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాల కోసం అటు తమిళ ఆడియన్స్ తో పాటూ ఇటు తెలుగు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. గతేడాది తెగింపు మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన అజిత్, రీసెంట్ గా విడాముయార్చితో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అజిత్ సరసన త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
గతేడాది కోలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి వచ్చిన ది గోట్, తంగలాన్, ఇండియన్2, కంగువ లాంటి సినిమాలన్నీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో తమిళ ఆడియన్స్ ఆశలన్నీ 2025పైనే పెట్టుకున్నారు. ఈ సంవత్సరాన్ని మదగజరాజాతో గ్రాండ్ గా స్టార్ట్ చేసిన కోలీవుడ్ ఇండస్ట్రీ అజిత్ నటించిన విడాముయార్చి ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తుందనుకున్నారు.
అందరి అంచనాలకు తగ్గట్టే విడాముయార్చి తమిళంలో సూపర్ హిట్ అయింది. రూ. 100 కోట్లపైగా కలెక్ట్ చేసిన విడాముయార్చి తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. తమిళంలో విడాముయార్చి పేరుతో రిలీజైన ఈ సినిమా తెలుగులో పట్టుదలగా రిలీజైంది. ఫిబ్రవరి 6న రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు విడాముయార్చిని ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా స్టైలిష్ గా కఅనిపిస్తుంది. కంటెంట్ పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్లే విడాముయార్చి ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. కానీ కోలీవుడ్ లో అజిత్ పెద్ద హీరో అవడం వల్ల అక్కడ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.