స్టార్‌ హీరో మూవీ.. షాకింగ్‌ అప్‌డేట్‌

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ప్రస్తుతం విడాముయర్చి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే

Update: 2024-04-29 07:52 GMT

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ప్రస్తుతం విడాముయర్చి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. త్రిష హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది. విడాముయర్చి సినిమా తర్వాత అజిత్‌ నటించబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

తమిళ హిట్‌ మూవీ మార్క్ ఆంటోనీ తో దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే టైటిల్‌ తో సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ఇప్పటికే మొదలు అయ్యిందని తమిళ మీడియా వర్గాల సమాచారం అందుతుంది.

ఇప్పటికే ఈ సినిమాలో శ్రీలీల నటించబోతుంది అని వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు శ్రీలీలకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్ మరియు మీనాలు నటించబోతున్నారు అంటూ షాకింగ్ అప్‌డేట్‌ వస్తోంది.

అజిత్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అందులో రెండు పాత్రలకు జోడీగా సిమ్రాన్ మరియు మీనా కనిపించబోతున్నారు. మూడో పాత్రకు జోడీగా శ్రీలీల కనిపిస్తుందేమో చూడాలి. మొత్తానికి ముగ్గురు హీరోయిన్స్ తో అజిత్‌ ఒకే సినిమాలో రొమాన్స్ చేయబోతున్నాడు.

ఈ మధ్య కాలంలో సిమ్రాన్ మరియు మీనాలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరు హీరోలకు జోడీగా నటించడం మాత్రం చాలా ఏళ్ల తర్వాత. అందుకే ఈ సినిమా పై అందరి దృష్టి ఉంది. పాన్‌ ఇండియా రేంజ్ మూవీగా ఈ సినిమా రూపొందబోతుంది.

శ్రీలీలతో పాటు సిమ్రాన్ మరియు మీనాలు ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్స్ అయితే మాత్రం కచ్చితంగా సినిమాను జనాలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఇప్పటికే వచ్చిన వార్తల కారణంగా జనాల్లో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ పై ఆసక్తి పెరిగింది.

Tags:    

Similar News