అఖండ-2.. నిజంగా తాండవమే!

అయితే అఖండ-2.. బాలయ్య తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మంచి అంచనాలు పెట్టుకున్నామని, టైటిల్ థీమ్ తో హోప్స్ పెరిగిపోయాయని చెబుతున్నారు.

Update: 2024-10-16 13:25 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అఖండ అయితే వేరే లెవెల్ లో అలరించింది. 2021లో రిలీజ్ అయిన అఖండ మూవీ.. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్ల జాబితాలో చేరింది. సినిమాలో నటసింహం ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్నారు.

అఖండ్ సీక్వెల్ కోసం సినీ ప్రియులతోపాటు బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అఖండ-2 అద్భుతంగా ఉంటుందని బోయపాటి శ్రీను ఇప్పటికే పలుమార్లు తెలిపారు. ఆ తర్వాత రీసెంట్ గా BB4 పేరుతో అనౌన్స్మెంట్ వచ్చింది. నేడు.. అదే అఖండ-2 తాండవంగా మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు.. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేశారు. మూవీ టీమ్ తోపాటు బాలకృష్ణ కూతుర్లు నారా బ్రాహ్మణి, తేజస్విని వేడుకలో సందడి చేశారు.

అఖండ సీక్వెల్ కు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా.. ముహూర్తపు షాట్‌ కు బ్రాహ్మణి నేడు క్లాప్‌ కొట్టారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై గోపీ అచంట, రామ్ అచంట నిర్మిస్తున్నారు. అఖండకు బాక్సులు బద్దలయ్యేలా అవుట్ పుట్ అందించిన తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కతున్న అఖండ-2కు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన టైటిల్ థీమ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సినీ ప్రియులతో పాటు బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రుద్రాక్ష మాలతో స్టార్ట్ టైటిల్ థీమ్ అవ్వగా.. ఆ తర్వాత శివయ్యను, మంచు కొండల మధ్య ఉన్న శివలింగాన్ని చూపించారు. నంది రంకెలేసుకుని రాగా.. బాలయ్య విభూతి పెట్టుకుని సిద్ధమవుతున్నట్లు కనిపించి వేరే లెవెల్ లో అలరించారు. టైటిల్ థీమ్ మొత్తానికి తమన్ ఇచ్చిన బ్లాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

అయితే అఖండ-2.. బాలయ్య తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మంచి అంచనాలు పెట్టుకున్నామని, టైటిల్ థీమ్ తో హోప్స్ పెరిగిపోయాయని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని.. బాలయ్యను బోయపాటి ఈసారి ఎలా చూపిస్తారోనని అంటున్నారు. నిజంగా సినిమా శివ తాండవమేనని కామెంట్లు పెడుతున్నారు. మరి అఖండ-2.. ఫస్ట్ పార్ట్ కు మించిన హిట్ అవుతుందేమో చూడాలి.

Full View
Tags:    

Similar News