అఖిల్ కు ఆ ముగ్గురి లక్ ఫ్యాక్టర్ కలిసొస్తుందా?

ఈసారి అఖిల్ కు శ్రీలీల, థమన్, నాగవంశీల లక్ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తుందని అంటున్నారు.

Update: 2024-12-17 07:27 GMT

హిట్టు కోసం గట్టిగా కష్టపడుతున్న హీరోలలో అఖిల్ అక్కినేని ఒకరు. హీరోగా తెరంగేట్రం చేసిన దగ్గర నుంచీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కానీ దానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోతున్నాడు. 'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నరకు పైగానే గ్యాప్ తీసుకున్న అక్కినేని వారసుడు.. ఈ సమయాన్ని మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోడానికి ఉపయోగించుకున్నాడు. ఇందులో భాగంగా లేటెస్టుగా 'Akhil 6' చిత్రాన్ని ప్రారంభించారు.

'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరి డైరెక్షన్ లో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఇది చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియాడిక్ రూరల్ లవ్ స్టోరీ అని టాక్. దీనికి ''లెనిన్'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్ ఎస్. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. మనం ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'లెనిన్' సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించి, 2025 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అఖిల్ ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీతో యూత్ కింగ్ కెరీర్‌ కచ్చితంగా తిరిగి ట్రాక్‌లో పడుతుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. ఈసారి అఖిల్ కు శ్రీలీల, థమన్, నాగవంశీల లక్ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తుందని అంటున్నారు.

టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ముందు వరుసలో ఉంటుంది. ఈ మధ్యనే 'కిస్సిక్' అంటూ ఐటెమ్ సాంగ్ తో ఊపేసింది. ఇప్పుడు అఖిల్ తో కలిసి తొలిసారిగా రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. ఆమె పాపులారిటీ ఈ మూవీకి అదనంగా బజ్ తీసుకురావడానికి, మార్కెటింగ్ పరంగానూ హెల్ప్ అవుతుందని అనడంలో సందేహం లేదు. ఇక సంగీత దర్శకుడు థమన్ కు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థమన్ మ్యూజిక్ కొడితే ఆ సినిమా హిట్టు కొట్టినట్లే అనే పేరు పడిపోయింది.

అలానే మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా ప్రసిద్ధి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ భాగం అవుతుండటం 'Akhil 6' ప్రాజెక్ట్ కి చాలా ప్లస్ అవుతుందని భావించవచ్చు. ఇటీవల కాలంలో నాగవంశీ నిర్మించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు తీయడమే కాదు.. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో, డిఫరెంట్ స్ట్రాటజీతో దూకుడుగా ప్రమోట్ చేయడంలో, సేఫ్ గా రిలీజ్ చేయడంలో యువ నిర్మాత ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గతంలో అక్కినేని నాగచైతన్యతో 'ప్రేమమ్' వంటి సూపర్ హిట్ సినిమా తీశారు. ఈసారి అఖిల్ తో బ్లాక్ బస్టర్ మూవీ తీస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

వీటన్నటికీ తోడుగా ఎలాగూ కింగ్ నాగార్జున కూడా ఉన్నారు కాబట్టి, 'లెనిన్' మూవీతో అఖిల్ కచ్చితంగా సాలిడ్ సక్సెస్ సాధిస్తారనే నమ్ముతున్నారు. అదే జరిగితే ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాన్ ఇండియాకి వెళ్తాడని భావిస్తున్నారు. మరి వచ్చే ఏడాది అఖిల్ కెరీర్ పుంజుకోడానికి అవసరమైన బ్లాక్‌ బస్టర్‌ అందుతుందేమో చూడాలి.

Tags:    

Similar News