అఖిల్ తో అక్కినేని తరానికి మాస్!
దీంతో అక్కినేని ఫ్యామిలీ మాస్ ఇమేజ్ ఆశలన్నీ ఇప్పుడు అఖిల్ పైనే ఉన్నాయి.;

అక్కినేని ఫ్యామిలీ అంటే క్లాస్ ఇమేజ్ ఇమేజ్ తప్ప మాస్ ఇమేజ్ అన్నది తొలి నుంచి లేదు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, సుమంత్ అంతా క్లాస్ ఇమేజ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు తప్ప! మాస్ లో మాత్రం అక్కినేని ప్రభావం అంతగా లేదన్నది కాదనలేని వాస్తవం. నాగార్జున, నాగచైతన్య కొన్ని చిత్రాలతో ప్రయత్నించినప్పటికీ అది పరిపూర్ణం కాలేదు. అక్కినేని వారసల క్లాస్ చిత్రాలకు వచ్చిన రెస్పాన్స్ మాస్ చిత్రాలకు రాలేదు.
అలా అక్కినేని కుటుంబంపై మాస్ ఇంపాక్ట్ అన్నది పెద్దగా ప్రభావం చూపలేదు. మాస్ స్టార్ గా ఏ హీరో కూడా హైలైట్ అవ్వలేదు. దీంతో అక్కినేని ఫ్యామిలీ మాస్ ఇమేజ్ ఆశలన్నీ ఇప్పుడు అఖిల్ పైనే ఉన్నాయి. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లవుతుంది. పరిశ్రమకి వచ్చిన కొత్తలోనే అఖిల్ కటౌట్..వాయిస్ లో బేస్ చూసి మాస్ ఇమేజ్ తద్యమనుకున్నారంతా. కానీ ఇప్పటి వరకూ మాస్ చిత్రాలు చేయలేదు.
అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన క్లాస్ అండ్ లవ్ స్టోరీల్లోనే నటించాడు. `ఏజెంట్` తో కాస్త డిఫరెంట్ అటెంప్ట్ చేసాడు కానీ కలిసి రాలేదు. అయితే `లెనిన్` తో అసలైన మాస్ ని పరిచయం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన `లెనిన్` మాస్ గ్లింప్స్ తో అదరగొడుతున్నాడు. సీమ బ్యాక్ డ్రాప్ ...యాస్ లో అఖిల్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మాస్ లుక్ లో ఒదిగిపోయాడు.
మాస్ డైలాగులు సెట్ అయ్యయి. వాయిస్ లో బేస్ అంతే పర్పెక్ట్ గా సింక్ అయింది. జస్ట్ గ్లింప్స్ తోనే అఖిల్ పై పాజిటివ్ ఇంప్రెషన్ పడింది. దీంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ మాస్ స్టార్ అవుతాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ కూడా అంతే కాన్పిడెంట్ గా ఉంది. `లెనిన్` డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతోన్న మాస్ చిత్రమిది. ఈ సినిమా హిట్ అయి అకిల్ మాస్ కి కనెక్ట్ అయితే తిరుగుండదు. అక్కినేని ఫ్యామిలీ చిరకాల కల నెరవేరినట్లే.