నాటు నాటు పాటకు స్టెప్పులేసిన అఖిల్
అలాంటి నాటు నాటు సాంగ్ కు అఖిల్ స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలందరూ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ పెళ్లి వేడుకలో భాగంగా వారంతా అక్కడ చిందులేస్తున్నారు. తెలుగు సినీ నిర్మాత A. మహేష్ రెడ్డి కొడుకు పెళ్లి కోసం తెలుగు తారలంతా దుబాయ్ కు వెళ్లారు. ఈ పెళ్లిలో దిగిన ఫోటోలను తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాలో షేర్ చేసింది.
కీర్తి, నితేష్ తమ బ్యూటిఫుల్ జర్నీని కొనసాగిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది, లైఫ్ లాంగ్ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్తూ, ఆ పెళ్లిలో దిగిన ఫోటోలను నమ్రత షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన, అమల లాంటి సెలబ్రిటీలున్నారు.
ఈ పెళ్లికి టాలీవుడ్ తారలతో పాటూ సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కూడా హాజరై, తన పెర్ఫార్మెన్స్ తో పెళ్లికి వచ్చిన వారందరినీ ఆనందింపచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇదే పెళ్లిలో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు.
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, చరణ్ పోటీగా డ్యాన్స్ వేసిన ఈ పాటలోని స్టెప్పులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రశంసలొచ్చాయి. అలాంటి నాటు నాటు సాంగ్ కు అఖిల్ స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
నాటు నాటు సాంగ్ చివర్లో రామ్ చరణ్ కింద పడిపోయినట్టే అఖిల్ కూడా ఈ సాంగ్ లాస్ట్ లో కింద పడిపోవడాన్ని చూసి అఖిల్ డెడికేషన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. అఖిల్ ఎంత మంచి డ్యాన్సర్ అనేది మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సైలెంట్ గా ఓ సినిమాను మొదలుపెట్టిన అఖిల్ ఆ సినిమా షూటింగ్ తో పాటూ సీసీఎల్ ఆడుతూ బిజీబిజీగా ఉన్నాడు.