బిజీబిజీగా అక్కినేని జోడి.. డేట్ ఫిక్స్?

టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన అక్కినేని ఇంట రీసెంట్ గా పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే.

Update: 2025-02-20 07:46 GMT

టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన అక్కినేని ఇంట రీసెంట్ గా పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. స్నేహితులుగా పరిచయమైన వారు.. పెద్దల సమక్షంలో భార్యాభర్తలుగా మారారు. ఇప్పుడు తమ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.

అయితే అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి మొదలవ్వనున్న సంగతి విదితమే. చైతూ పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి జైనాబ్ రేవడ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున.. సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. పిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ వేడుక జరిగింది.

ఆ తర్వాత చైతూ- శోభిత పెళ్లిలో తనకు కాబోయే భార్యతో అఖిల్ సందడి చేశారు. అందుకు సంబంధించిన పిక్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కూడా కనిపించారు. ఆ పిక్.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో మ్యారేజ్ షాపింగ్ లో అఖిల్, జైనబ్ బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు అఖిల్ పెళ్లి కూడా హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో జరగనుందని తెలుస్తోంది. చైతూ వివాహం కూడా అక్కడే జరగ్గా.. ఇప్పుడు అఖిల్ మ్యారేజ్ కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని టాక్. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట.

మార్చి చివరి వారంలో అఖిల్ వివాహం జరగనుందని సమాచారం. 24వ తేదీనే అఖిల్, జైనబ్ ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరగనుందని వినికిడి. అనేక మంది ప్రముఖులు.. అతిథులుగా రానున్నారని సమాచారం. సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని వినికిడి.

ఈ విషయాలు తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. వెయిటింగ్ ఫర్ పిక్స్ అని చెబుతున్నారు. అయితే కెరీర్ విషయానికొస్తే.. అఖిల్ తన కొత్త మూవీని ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. రెండు బడా నిర్మాణ సంస్థలతో ఆయన రెండు సినిమాలకు పని చేస్తున్నారని సమాచారం. మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News