విశ్వంభర.. అఖిల్ నెక్స్ట్.. మ్యాటరెంటి?

పిరియాడిక్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందనే ప్రచారం నడుస్తోంది. సినిమా కోసం అఖిల్ తన లుక్ కంప్లీట్ గా మార్చుకున్నారు.

Update: 2024-07-27 05:05 GMT

అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో నిర్మించారు. కమర్షియల్ హీరోగా అతనిని ఎస్టాబ్లిష్ చేయడానికి మంచి ప్లాట్ ఫామ్ దొరికింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో మూవీ చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

నెక్స్ట్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇది కూడా యావరేజ్ గానే నిలిచింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో చేసిన ఏజెంట్ సినిమా చేయగా అది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడి, బాడీ చేంజ్ చేసుకున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా డూప్ లేకుండా చేశారు. అయినా కూడా కంటెంట్ లో దమ్ము లేకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

దీని తర్వాత అఖిల్ ఇప్పటివరకు ఏ సినిమాని కూడా అనౌన్స్ చేయలేదు. అయితే 100 కోట్ల బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీ రెడీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యింది. అనిల్ కుమార్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. పిరియాడిక్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందనే ప్రచారం నడుస్తోంది. సినిమా కోసం అఖిల్ తన లుక్ కంప్లీట్ గా మార్చుకున్నారు.

అయితే ఈ సినిమా భవిష్యత్తు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా పైన ఆధారపడి ఉందనే మాట వినిపిస్తోంది. విశ్వంభర సినిమాని యూవీ క్రియేషన్స్ 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీంతో పాటుగా యూవీ క్రియేషన్స్ సూర్య కంగువ మూవీ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. దీంతో ఈ రెండు సినిమాలపైన భారీగా పెట్టుబడులు పెట్టారు. కంగువ సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది. అయితే విశ్వంభర మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్ లాంటివి వస్తే గాని బిజినెస్ స్టార్ట్ కాదు. మెగాస్టార్ ఇమేజ్ మీద మూవీ మార్కెట్ చేసిన అది కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమవుతుంది. ఇతర భాషల్లో కూడా విశ్వంభర సినిమాకి సాలిడ్ ధర రావాలంటే కంటెంట్ మీద ఆధారపడి ఉంది. ఈ మూవీ బిజినెస్ అయితే గాని అఖిల్ కొత్త సినిమాని స్టార్ట్ చేయలేని పరిస్థితి నెలకొని ఉందంట. అందుకే విశ్వంభర మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయిన తర్వాత అఖిల్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని యూవీ క్రియేషన్స్ వాళ్లు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News