పెద్దనాన్న మూవీలో అకీరా? నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ స్టార్ గెలిచాక.. అకీరా నందన్ మీడియాలో బాగా కనిపించడంతో త్వరగా సినిమాల్లోకి తీసుకొచ్చేయ్ అన్న అంటూ పవన్ కు రిక్వెస్ట్ చేశారు.

Update: 2024-09-30 21:30 GMT
పెద్దనాన్న మూవీలో అకీరా? నిజమేనా?
  • whatsapp icon

టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే అనేక మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తమ టాలెంట్ ఏంటో చూపిస్తూ సత్తా చాటుతున్నారు మెగా హీరోలు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ స్టార్ గెలిచాక.. అకీరా నందన్ మీడియాలో బాగా కనిపించడంతో త్వరగా సినిమాల్లోకి తీసుకొచ్చేయ్ అన్న అంటూ పవన్ కు రిక్వెస్ట్ చేశారు.

అయితే అకీరా నందన్ కు మ్యూజిక్ పై ఎంత ఇంట్రెస్ట్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. రీసెంట్ గా అకీరా క్రియేట్ చేసిన వివిధ వీడియోస్ కూడా పోస్ట్ చేసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం.. అకీరా హీరో అవ్వాలనే కోరుకుంటున్నారు. ఇటీవల అకీరా కెరీర్ ఏంటి అనేది తన నిర్ణయానికే వదిలేస్తామని రేణు దేశాయ్ వెల్లడించింది. దీంతో అకీరా నందన్.. హీరో మెటీరియల్ అని, అందుకే హీరోగానే అడుగు పెట్టాలనేది తమ కోరిక అని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇప్పుడు అకీరా నందన్ డెబ్యూ మూవీ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో అకీరా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో అకీరా రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే పవన్ వారసుడు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే దాదాపు 80 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ కు మేకర్స్ గుమ్మడికాయ కొట్టనున్నారని సమచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న విశ్వంభర కోసం వివిధ భాషలకు చెందిన స్టార్ సెలబ్రిటీలను రంగంలోకి దింపినట్లు సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. పలువురు బ్యూటీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి విశ్వంభరలో అకీరా నటిస్తున్నారన్న వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News