అక్కినేని అఖిల్.. ఈసారి బిగ్ చాలెంజ్

ప్రస్తుతం ఈ సినిమాలో క్యారెక్టర్ కి కావాల్సిన లుక్ కి సరిపోయే విధంగా అఖిల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్నాడు. ఓ వైపు యుద్ధవిద్యలు నేర్చుకుంటూనే క్యారెక్టర్ లుక్ పై శ్రద్ధ పెట్టాడు.

Update: 2024-06-22 05:19 GMT

అక్కినేని యువ హీరో అఖిల్ గత ఏడాది ఏజెంట్ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని చూడాల్సి వచ్చింది. ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడనేది స్క్రీన్ మీద చూస్తే అర్ధమవుతుంది. అయితే కంటెంట్ లో దమ్ము లేకపోవడంతో అఖిల్ కష్టం వృధా అయ్యింది. అలాగే ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా అప్పటివరకు అలాంటి డిజాస్టర్ ను ఎదుర్కోలేదు. ఇక అఖిల్ క్రింద పడ్డ కూడా ఈ సారి మరింత బలంగా కొట్టాలనే కసితో ఉన్నాడు.

 

అందుకు తగ్గట్లుగానే పీరియాడికల్ జోనర్ లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్ ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించబోతోంది. అనిల్ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో క్యారెక్టర్ కి కావాల్సిన లుక్ కి సరిపోయే విధంగా అఖిల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్నాడు. ఓ వైపు యుద్ధవిద్యలు నేర్చుకుంటూనే క్యారెక్టర్ లుక్ పై శ్రద్ధ పెట్టాడు.

పొడవైన జుట్టు, గడ్డంతో అఖిల్ కొత్త లుక్ లో ఈ మధ్య కనిపించాడు. దీంతో ఇది సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కబోయే సినిమా అనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదంటే. ఈ కొత్త సినిమాలో అఖిల్ 11వ శతాబ్దానికి చెందిన ఒక ట్రైబల్ వీరుడిగా కనిపిస్తాడంట. అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్. షూటింగ్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు త్వరలో వచ్చే అవకాశం ఉందంట. అలాగే 11వ శతాబ్దంలో జరిగిన కథగానే ఈ మూవీ కథాంశం ఉంటుందంట. షూటింగ్ మొత్తం ఫారెస్ట్ లోనే జరగబోతోందంట. ఇది అతనికి బెస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు అఖిల్ హీరోగా ఐదు సినిమాలు చేశాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కమర్షియల్ హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలు పెద్ద ఆదరణకి నోచుకోలేదు. అయితే నటుడిగా సినిమా సినిమాకి తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. మరి ఈ కొత్త సినిమాలో అఖిల్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకొని కమర్షియల్ హీరోగా నిలబడాలని బలంగా అనుకుంటున్నాడు. మరి అతని కోరిక నెరవేరుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News