అసలే ప్లాపుల్లో ఆహీరో...మధ్యలో ఇదో సమస్యా?
కిలాడీ అక్షయ్ కుమార్ ఓవైపు ఆన్ సెట్స్ లో బిజీగా ఉంటూనే కొత్త చిత్రాల జోరు కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే.
కిలాడీ అక్షయ్ కుమార్ ఓవైపు ఆన్ సెట్స్ లో బిజీగా ఉంటూనే కొత్త చిత్రాల జోరు కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. కథ నచ్చితే ఒకే చేయడం డేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ బయోపిక్ ని లాక్ చేసారు. రఘు పాలట్ - పుష్పా పాలత్ రచించిన `ది కేస్ దట్ షేక్ ది ఎంపైర్` పుస్తకం ఆధారంగా కరణ్ సింగ్ త్యాగీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ తేది విషయంలో కరణ్ జోహార్ పునరాలోచించమని అక్షయ్ ని కోరినట్లు సమాచారం. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. అక్షయ్ కుమార్ నటిస్తోన్న మరో చిత్రం `జాలీ ఎల్ ఎల్ బీ-3` ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు న్యాయవాది వృత్తిని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రాలే.
ఈ నేపథ్యంలో కరణ్ జాలీ ఎల్ ఎల్ బీ3 సినిమా విషయంలో పునరాలోచన కోరినట్లు తెలుస్తోంది. రెండు సినిమాల మధ్య 20 రోజులు గ్యాప్ ఉన్నా? కంటెంట్ రిలేటడ్ గా ఉండటంతో ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుంది? అన్న సందేహంలోనే కరణ్ ఈ ప్రపోజల్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే జాలీ ఎల్‌ఎల్‌బి 3 నిర్మాతలు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ అక్షయ్ కుమార్ అంగీకరించినా నిర్మాతలు అందుకు ఒప్పుకుంటారా? అన్నది మరో సందేహం.
ఎందుకంటే తొలుత జాలీ ఎల్ ఎల్ 3 రిలీజ్ తేదిని లాక్ చేసుకుంది. వెనకొస్తున్న నాయర్ చిత్రాన్ని తమ సినిమా కోసం వాయిదా వేసుకోవడం అన్నది ఎంత వరకూ సమంజసం అన్నది కూడా ఆలోచిస్తారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమా రిలీజ్ ల మధ్య అక్షయ్ కుమార్ నలిగిపోవడం తప్పదు. ఇప్పటికే ఆయన వరుస ప్లాప్ లతో సతమత మవుతున్నాడు. కొత్తగా ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన నెత్తిన పడేలా ఉంది.