టాప్ -10 లో ప్లాప్ హీరో ఆ రేంజ్ లో ఛార్జ్!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేరెత్తితే ప్లాపులు తప్ప ఇంకేం గుర్తుకు రావు. గత రెండు...మూడేళ్లగా అక్షయ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేరెత్తితే ప్లాపులు తప్ప ఇంకేం గుర్తుకు రావు. గత రెండు...మూడేళ్లగా అక్షయ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. చేసిన సినిమాల సంఖ్య చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఆయన చేసినన్ని సినిమాలు ఇంకే బాలీవుడ్ హీరో కూడా చేయలేదు. `సూర్య వంశీ` హిట్ తర్వాత చేసిన 10కి పైగా చిత్రాలు ప్లాప్ అయినవే. మరి ఇన్ని ప్లాప్ లున్న హీరో పారితోషికంలో టాప్ -10లో నిలిచారు? అంటే నమ్ముతారా.
కానీ నమ్మాల్సిన నిజం. జయాపజయాలతో సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో పారితోషికం వివిధ సినిమాలకు అందుకోవడంతో ఈ స్థానం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ పోర్స్బ్ ఇండియా 2024 ప్రకారం అత్యధిక పారితోషికం అందుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ లో ఉన్నారు. `పుష్ప-2` సినిమాకు 300 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు పోర్స్బ్ పేర్కొంది. ఆ తర్వాత రెండవ స్థానంలో దళపతి విజయ్ నిలిచారు.
దళపతి 69వ సినిమా కోసం 130 నుంచి 270 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ `డంకీ` కోసం 150 నుంచి 250 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో రజనీకాంత్, అమీర్ ఖాన్, ప్రభాస్, అజిత్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లు ఉన్నారు. చివరిగా అక్షయ్ కుమార్ 60 కోట్ల నుంచి 145 కోట్లు పారితోషికంతో నిలిచారు.
ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నా ఇంత భారీ మొత్తంలో అక్షయ్ కుమార్ పారితోషికం తీసుకుంటున్నారు? అంటే చిన్న విషయం కాదు. ఆయన సినిమాలు ప్లాప్ అవుతున్నా? నిర్మాతలు ఆయన ముందు క్యూ కడుతున్నారు. అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. గత పరాజయాలతో సంబంధం లేకుండా ఒప్పందం చేసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ 2025 క్యాలెండర్ కూడా ఇప్పటికే ఫిల్ అయింది. ఆయన తో సినిమా చేయాలంటే? 2026 వరకూ వెయిట్ చేయాల్సిందే.