అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ టాక్ ఏంటి..?

సినిమా ప్రచార చిత్రాలతో బజ్ క్రియేట్ చేయగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2025-01-24 17:43 GMT

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో సందీప్, అభిషేక్ అనిల్ కపూర్ దర్శక ద్వయం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా స్కై ఫోర్స్. ఇండియా పాకిస్థాన్ మధ్య 1965 లో జరిగిన యుద్ధ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రచార చిత్రాలతో బజ్ క్రియేట్ చేయగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్కై ఫోర్స్ కథా నేపథ్యం.. ఇండియా పాకిస్తాన్ 1965 యుద్ధం జరుగుతుంది. ఆ టైం లో భారత వైమానిక దళం స్క్వాడ్రన్ ఫైటర్ ఫైలట్ టి కృష్ణ విజయ్ (వీర్ పహారియా సింగ్) తన తోడి సైనికులను రక్షించేందుకు శత్రు భూభాగంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఓం అహుజా (అక్షయ్ కుమార్) కృష్ణ విజయ్ త్యాగాలకు ఏం చేశాడు..? సర్గోద మీద భారత్ దాడి చేయడం వెనక కారణాలు ఏంటి..? ఆ టైం లో రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి..? అన్నది సినిమా కథ.

దర్శకులు సందీప్, అభిషేక్ లు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల జీవితాన్ని తెర మీదకు తీసుకు రావడం మంచి విషయమే. ఐతే ఇలాంటి కథను చెప్పే విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు వస్తే ముందు వచ్చిన సినిమాలతో ఈజీ కంపారిజన్ ఉంటుంది. ముఖ్యంగా టామ్ క్రూజ్ చేసిన టాప్ గన్ సినిమాతోనే అందరు పోల్చి చూస్తారు. అలాంటి కంపేరిజన్ లేకుండా సినిమాను నడిపించాల్సి ఉంటుంది.

స్కై ఫోర్స్ సినిమాలో అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఐతే సారా అలీ ఖాన్ పాత్ర తో పాటు సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్ ఇంపాక్ట్ కనిపించదు. అంతేకాదు యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు. దేశ భక్తి సినిమాలు ఎలా ఉన్నా కొంతమంది ప్రేక్షకులను అలరిస్తాయి. ఐతే కాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. కొంత ఎడిటింగ్ బాగుంటే స్కై ఫోర్స్ బాగుండేది అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఇదివరకు వచ్చిన ఇలాంటి సినిమాలతో పోల్చి చూడటం చాలా కామన్ అనిపిస్తుంది. దర్శక ద్వయం ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే సినిమాను ఇంకా బెటర్ గా తీసి ఉండే ఛాన్స్ ఉండేది. అక్షయ్ కుమార్ సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మరి స్కై ఫోర్స్ సినిమా ఓవరాల్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News