స్టార్ హీరోలు.. ఇది క‌చ్ఛితంగా రాహుకేతు ప్ర‌భావ‌మే!

ఇంత‌కీ ఎవ‌రు ఈ స్టార్ హీరో? అంటే.. ఖిలాడీ అక్ష‌య్ కుమార్. ఈ రెండు మూడేళ్ల‌లో అత‌డు న‌టించిన‌ సూర్య‌వంశీ- అత్రాంగిరే- ఓ మైగాడ్ 2 లాంటి సినిమాలు త‌ప్ప ఇత‌ర సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర వైఫ‌ల్యాల‌ను చ‌వి చూశాయి.

Update: 2024-04-13 08:30 GMT

ఎవ‌రైనా ఒక వ్య‌క్తి అత్యుత్త‌మ‌ స్థానానికి ఎదిగాక.. తిరిగి అనూహ్యంగా కిందికి ప‌డిపోవడం ప్రారంభ‌మైతే క‌చ్ఛితంగా దానికి కార‌ణాల‌ను అన్వేషించాలి. ప‌దే ప‌దే వైఫ‌ల్యాల‌ను ఎదుర్కొంటూ గ్రాఫ్ ప‌రంగా నేల‌కి దిగిపోవాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌స్తుంది? అంటే... దైవ‌శ‌క్తిని, గ్ర‌హ‌గ‌తుల్ని న‌మ్మేవాళ్లు క‌చ్ఛితంగా ఇది రాహుకేతువు లేదా శ‌ని ప్ర‌భావం అని బ‌లంగా న‌మ్ముతారు. జ్యోతిష‌శాస్త్రంలో దీనికి ప‌రిష్కారాలు చెబుతుంటారు. అలాగే వీలుంటే కాల‌హ‌స్తికి వెళ్లి ర‌మ్మంటారు పెద్ద‌లు.

 

అలాంటి ఒక స‌ల‌హా ఇవ్వాల్సి వ‌స్తే.. ఒక ప్ర‌ముఖ హీరోకి కాళ‌హ‌స్తికి పంప‌డం స‌రైన నిర్ణ‌యం అని విశ్లేషిస్తున్నారు సోషల్ మీడియా జ‌నం. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ప‌ది ఫ్లాప్ సినిమాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న స‌ద‌రు స్టార్ హీరో .. ఇటీవ‌లే మ‌రో ఫ్లాప్ ని అందించాడు. ఇది కెరీర్ ప‌రంగా చెత్త ద‌శ‌. క‌రోనా క్రైసిస్ నుంచి హిందీ చిత్ర‌సీమ వేగంగా కోలుకుంద‌ని భావిస్తే, ఇలాంటి స‌మ‌యంలో అత‌డు ఏకంగా 14 సినిమాల్లో న‌టించి ప‌ది ఫ్లాపులివ్వ‌డంపై విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి. ఇంత‌కీ ఎవ‌రు ఈ స్టార్ హీరో? అంటే.. ఖిలాడీ అక్ష‌య్ కుమార్. ఈ రెండు మూడేళ్ల‌లో అత‌డు న‌టించిన‌ సూర్య‌వంశీ- అత్రాంగిరే- ఓ మైగాడ్ 2 లాంటి సినిమాలు త‌ప్ప ఇత‌ర సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర వైఫ‌ల్యాల‌ను చ‌వి చూశాయి. ఇది తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది.

తాజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి క‌నీసం వంద కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేని ధీన‌స్థితిలోకి వెళ్లిపోయింది. కానీ ఈ ఘోర‌మైన ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా అత‌డు ఏకంగా అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అక్ష‌య్ చాలా మారాల‌ని, అత‌డి స్క్రిప్టు ఎంపిక‌లు స‌హా స్క్రీన్ ప్రెజెన్స్ పరంగాను మారాల్సి ఉంద‌ని కొంద‌రు సూచిస్తుండ‌గా, దీనంత‌టికీ కార‌ణం అత‌డిపై శ‌ని ప్ర‌భావం అధికంగా ఉంద‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తిలో శ‌ని దేవుని సంద‌ర్శించి రాహుకేతు పూజ‌లు ఆచ‌రిస్తేనే అత‌డు బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌డ‌ని కూడా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

స్టార్ హీరోల‌కు బ్యాడ్ ఫేజ్..

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి మాత్ర‌మే కాదు.. ఇంత‌కుముందు ఇలాంటి బ్యాడ్ ఫేజ్ ని ఎదుర్కొన్న చాలామంది నార్త్, సౌత్ హీరోలు ఉన్నారు. ఇందులో ది గ్రేట్ అమితాబ్ బ‌చ్చ‌న్, త‌మిళ స్టార్ హీరో సూర్య‌, నేచుర‌ల్ స్టార్ నాని, హీరో నితిన్ వంటి స్టార్లు ఇదే త‌ర‌హాలో డ‌జ‌ను ఫ్లాపులు ఎదుర్కొని ఆ త‌ర్వాత తిరిగి కంబ్యాక్ అయిన విష‌యాన్ని గుర్తు చేసుకుని తీరాలి. అక్ష‌య్ బ్యాడ్ ఫేజ్ కొంత‌కాల‌మేనా... అత‌డిపై ప్ర‌జ‌ల్లో విముఖ‌త పెరిగిందా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం ఇవ్వాలి.

Tags:    

Similar News