అప్పుడే ఆ ఇద్ద‌రికీ పోటీగా క‌ళావ‌తి!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న అలియాభ‌ట్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది

Update: 2024-05-14 12:15 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న అలియాభ‌ట్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. అమ్మ‌డిప్పుడు ఏకంగా సీనియ‌ర్ భామ‌ల‌తోనే పోటీ ప‌డుతుంది. వాళ్ల‌తో స‌మాన పారితోషికం అందుకుంటుంది. హాలీవుడ్ లో న‌టించిన అనుభ‌వం..బాలీవుడ్ క్రేజ్ దృష్ట్యా భారీగానే సంపాదిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా క‌థ న‌చ్చితే ఎలాంటి సినిమాలైనా ఒకే అంటూ ముందుకెళ్తుంది. అలాగే కియారా అద్వాణీ కూడా ఇదే దూకుడుతో సినిమాలు చేస్తోంది.

ఇప్ప‌టికే న‌టిగా త‌న బ్రాండ్ బాలీవుడ్ లో వేసేసింది. ఎలాంటి పాత్ర‌లైనా కియారా ఒకే అంటూ దూసుకుపోతుంది. యంగ్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ కియారా అనే ముద్ర‌ను వేసుకుంది. తెలుగులో `గేమ్ ఛేంజ‌ర్` సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో కి అడుగు పెడుతుంది. ఇలా కియారా...అలియా భారీ స్టార్ డ‌మ్ ఉన్న హీరోయిన్లు. అయితే వీళ్లిద్ద‌రితో పాటు పోటీకి సై అంటోంది కీర్తిసురేష్‌. అమ్మ‌డు ఇప్పుడే బాలీవుడ్ లో కెరీర్ మొద‌లు పెట్టింది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేదు. క‌మిట్ అయిన చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

అయినా త‌గ్గేదేలే అంటూ నార్త్ లో ఆ ఇద్ద‌రితో ఓ సినిమా విష‌యంలో పోటీకి దిగింది. కిలాడీ అక్ష‌య్ కుమార్ హీరోగా ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఈ ముగ్గురి భామ‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ముగ్గురుతోనూ ద‌ర్శ‌కుడు సంప్ర‌దింపులు జ‌రిపారు. అయితే వాళ్ల‌లో ఎవ‌ర్ని తీసుకో వాలి? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. ఉన్న ఒక్క హీరోయిన్ పాత్ర‌కు ముగ్గురు ప‌క్కాగా స‌రిపోవ‌డంతో? ద‌ర్శ‌కుడు ఎంపిక విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

క్రేజ్ ప్ర‌కారం చూసుకుంటే? బాలీవుడ్ లో లీస్ట్ లో కీర్తి సురేష్ ఉంటుంది. అలియా..కియారా కి అక్క‌డ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. అలియాభ‌ట్ అయితే సోలోగా బాక్సాఫీస్ ని షేక్ చేయ‌గ‌ల‌దు. కియారా అయితే పాత్ర కోసం ప‌రిమితుల్ని క్రాస్ చేయ‌గ‌ల‌దు. ఈ రెండు కూడా కీర్తిలో క‌ష్టం. వాళ్లిద్ద‌రి అంత డేరింగ్ గా చేయ‌గ‌ల‌దా? అన్న దానిపై ద‌ర్శ‌కుడు ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి తుదిగా ప్రాజెక్ట్ లోకి ఎవ‌రు వ‌స్తారు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News