రీమేక్లతో ప్రమాదంలో స్టార్ హీరో?
సెల్ఫీ , బచ్చన్ పాండే వంటి రీమేక్లతో ఇటీవల విఫలమైన అక్షయ్ కుమార్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాడంటూ కొందరు విశ్లేషించారు.
ఖిలాడీ అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్లతో తీవ్రమైన క్రైసిస్ లో ఉన్నాడు. అతడు నటించిన వరుస చిత్రాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇటీవల సెల్ఫీ, మిషన్ రాణి గంజ్ డిజాస్టర్లు. ఆ తర్వాత బడే మియాన్ చోటే మియాన్ 250 కోట్ల భారీ నష్టాలను చవిచూసింది. ఇలాంటి సమయంలో అతడు నటించిన సర్ఫిరా విడుదలవుతోంది. ఇది సూర్య నటించిన బ్లాక్ బస్టర్ OTT మూవీ 'సూరరై పొట్రు'(ఆకాశం నీ హద్దురా)కి రీమేక్.
తాజాగా రిలీజైన ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో పాత్రలను పాత్రధారులను ఒరిజినల్ వెర్షన్ లో పాత్రధారులతో పోల్చి చూస్తున్నారు ఆడియెన్. అక్షయ్ ఎక్కడా సూర్య రేంజుకు సరిపోలలేదని, అలాగే కథానాయిక అపర్ణ బాలమురళి పెర్ఫామెన్స్ ముందు అక్షయ్ నాయిక ఎక్కడా కనిపించడం లేదని విమర్శలొచ్చాయి. సెల్ఫీ , బచ్చన్ పాండే వంటి రీమేక్లతో ఇటీవల విఫలమైన అక్షయ్ కుమార్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాడంటూ కొందరు విశ్లేషించారు.
జూలై 12 న సర్ఫిరా విడుదల కానుంది. ఈ రీమేక్ సినిమాపై అభిమానులు అంతగా ఆసక్తిగా లేరని అక్షయ్ తెలిసి కూడా తప్పు చేస్తున్నాడని విమర్శలొస్తున్నాయి. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశంలో విమానయానాన్ని విప్లవాత్మకంగా మార్చాలనే సామాన్య యువకుడి కల చుట్టూ తిరుగుతుంది. యువతరాన్ని ఎగ్జయిట్ చేసే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కానీ ఇది హిందీ ఆడియెన్ కి ఏమేరకు ఎక్కుతుందో వేచి చూడాలి.