డబ్బింగ్‌ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చేవేమో...!

ప్రేక్షకులు రాకపోవడంతో మల్టీప్లెక్స్ చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్ వారు చాయ్‌ సమోసా ఫ్రీ ఆఫర్‌ ను ప్రకటించారు.

Update: 2024-07-16 14:25 GMT

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన సూరారై పోట్రు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి ఉంటే వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి అనేది ఆ సమయంలో వచ్చిన టాక్.

తెలుగు లో ఆకాశమే నీ హద్దురా అంటూ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయిన ఈ సినిమాకు దక్కిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో కూడా చాలా మంది డబ్‌ చేయాలని కోరారు. కానీ సూర్య మరియు ఇతర యూనిట్‌ సభ్యులు మాత్రం హిందీలో సూరారై పోట్రు డబ్బింగ్‌ చేయడం కంటే రీమేక్ చేస్తే ఉత్తమం అనుకున్నారు.

కాస్త ఆలస్యం అయినా కూడా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తో సర్ఫిరా అనే టైటిల్‌ తో రీమేక్ చేయడం జరిగింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అక్కడి ప్రేక్షకులను మినిమం కూడా ఈ సినిమా ఆకట్టుకోలేక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ప్రేక్షకులు రాకపోవడంతో మల్టీప్లెక్స్ చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్ వారు చాయ్‌ సమోసా ఫ్రీ ఆఫర్‌ ను ప్రకటించారు. థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాయ్ సమోసా ను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించినా కూడా టికెట్లు ఏ మాత్రం తెగడం లేదు.

మొదటి వారం కూడా మినిమం వసూళ్లు నమోదు అవ్వక పోవడంతో ఇప్పటికే మేకర్స్ ఆశలు వదిలేసుకున్నట్లు బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్‌ రిలీజ్ లో ఎలాగూ ప్రేక్షకులను రప్పించలేక పోయిన సర్ఫిరా ను వెంటనే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయాలని భావిస్తున్నారు.

సర్ఫిరా ను ఒరిజినల్‌ వర్షన్‌ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర రూపొందించింది. ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా ఆమె జాగ్రత్త పడిందట. అయినా కూడా సినిమా ను జనాలు ఆదరించడం లేదు. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ లో నిర్మించడం తో పాటు గెస్ట్‌ పాత్ర లో నటించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వస్తున్న వసూళ్లను చూస్తుంటే సూరారై పోట్రు ను డబ్ చేసి విడుదల చేసినా ఇంతకు మించిన వసూళ్లు నమోదు అయ్యేవేమో అంటూ కొందరు మీమ్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News