పృథ్వీరాజ్ పదేళ్ల కూతురు టాలెంట్ చూశారా?
మలయాళ స్టార్ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్- సుప్రియ మీనన్ కు కూతురు ఉన్న విషయం తెలిసిందే.;

మలయాళ స్టార్ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్- సుప్రియ మీనన్ కు కూతురు ఉన్న విషయం తెలిసిందే. తన పేరు అలంకృత మీనన్ సుకుమారన్. ఇప్పుడామె వయసు 10 సంవత్సరాలు. 10 ఏళ్లకే అలంకృత తండ్రిలా ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఎల్2: ఎంపురాన్ సినిమాకు అలంకృత వర్క్ చేసింది.
అలా అని అలంకృత ఎంపురాన్ లో నటించలేదు. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ లో అలంకృత పని చేసింది. ఇప్పటికే అలంకృత మ్యూజిక్ నేర్చుకుంటూ తన క్రియేటివిటీని బయటపెడుతూ తండ్రి లానే ఇండస్ట్రీలో కొనసాగాలని చూస్తోంది. ఎంపురాన్ మూవీ టైటిల్ ట్రాక్ లో మరియు సినిమా ట్రైలర్ లాస్ట్ లో హెవీ మెటల్ సౌండ్స్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేశాయి.
వీటితో పాటూ ఎంపురానే అంటూ ఓ చైల్డ్ వాయిస్ మూవీ బీజీఎంలో హమ్మింగ్ లా వస్తూ ఉంటుంది. ఆ గొంతు మరెవరిదో కాదు, పృథ్వీరాజ్ కూతురు అలంకృత వాయిసే అది. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజే స్వయంగా వెల్లడించాడు. ఈ విషయంలో ఎల్2 మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ కూడా అలంకృతను ప్రశంసించారు. ముందుగా తాను అలంకృత ప్లేస్ లో ఓ పెద్ద సింగర్ ను తీసుకోవాలనుకున్నానని చెప్పారు.
కానీ పృథ్వీరాజ్ ఆ ఎమోషనల్ సీన్ కు పిల్లల గొంతు ఉండాలని చెప్పడంతో అలంకృత ట్రాక్ లోకి వచ్చిందని, కేవలం 5 నిమిషాల్లోనే అలంకృత దాన్ని రికార్డు చేసిందని ఎంతైనా అలంకృత పృథ్వీరాజ్ కూతురు కదా అంతే ఉంటుందిలే అని ప్రశంసించారు. పదేళ్ల వయసులోనే అలంకృత ఇంత టాలెంట్ చూపించిందంటే ఇక ముందు ముందు భవిష్యత్తులో అలంకృత ఎలాంటి రేర్ ఫీట్లు సాధిస్తుందో చూడాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.