మెగాస్టార్ నే వెన‌క్కి నెట్టేసిన కుర్ర హీరోలు!

మాలీవుడ్ లో కూడా ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డా క‌మర్శియ‌ల్ పంథాలో సినిమాలు చేయ‌డం మొద‌లైంది.;

Update: 2025-04-12 07:01 GMT
Content Beats Stardom: Alappuzha Jinkana Outshines Mammootty’s Bazooka at Box Office

మాలీవుడ్ లో కూడా ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డా క‌మర్శియ‌ల్ పంథాలో సినిమాలు చేయ‌డం మొద‌లైంది. ఒక‌ప్పుడు ఆర్టి సినిమాల‌కే ప‌రిమిత‌మైన మాలీవుడ్ లో ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్శి య‌ల్ సినిమాలు రూపొందుతున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని అందుకుంటున్నాయి. సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి ఈ మ‌ధ్య కాలంలో డీసెంట్ క్లాసిక్ హిట్లు ఎక్కువ‌గా మాలీవుడ్ నుంచే క‌నిపిస్తున్నాయి.

స్టార్ హీరోల్ని సైతం అక్క‌డ యంగ్ హీరోలు రేసులో వెన‌క్కి నెట్ట‌డం క‌నిపిస్తుంది. తాజాగా మ‌రోసారి అదే స‌న్నివేశం రిపీట్ అయింది. ఏప్రిల్ 10 మ‌మ్ముట్టి న‌టించిన `బాజూకా` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయింది. అదే సినిమాతో పాటు యంగ్ హీరోలె నాస్ల‌న్, గ‌ణ‌ప‌తి పొద్వేల్, లక్మ‌న్ ఆవ‌రాన్ న‌టించిన `అల‌ప్పుజ‌ జింఖానా` కూడా రిలీజ్ అయింది. మమ్ముట్టి సినిమా మార్కెట్ తో పొల్చితే ఇది చాలా సినిమా.

ఆ రెండు సినిమాలు పోటీనే కాదు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయింది. అయితే మొద‌టి రోజే మ‌మ్ముట్టి సినిమా వ‌సూళ్ల‌ను అల‌ప్పుజ బ్రేక్ చేసింది. బాజూకా 2.21 కోట్లు సాధించ‌గా అలప్పుజ జింఖానా 2.70 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వికీ లెక్క‌ల ప్ర‌కారం బాజూకా 3.25 కోట్ల వ‌సూళ్లు సాధించగా, అల‌ప్పుజ 7 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో మాలీవుడ్ సినిమాలో వ‌చ్చిన మార్పు చూసి అంతా స్ట‌న్ అవుతున్నారు.

ఓ పెద్ద స్టార్ సినిమా కంటెంట్ వీక్ గా ఉండ‌టంతో వ‌సూళ్లు ప‌డిపోయాయ‌ని క్లియ‌ర్ తెలుస్తుంది. భారీ స్టార్ క్యాస్టింగ్ కాక‌పోయినా కంటెంట్ తో అల‌ప్పుజ మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. అక్క‌డ ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని మ‌రోసారి ప్రూవ్ అయింది. కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేద‌ని అర్ద‌మ‌వుతుంది.

Tags:    

Similar News