మీర్జాపూర్ ది ఫిల్మ్.. పెద్ద ప్లానింగే ఇది..!

మీర్జాపూర్ మేకర్స్ మీర్జాపూర్ ది ఫిల్మ్ అంటూ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

Update: 2024-12-04 13:30 GMT

డిజిటల్ ఆడియన్స్ టార్గెట్ తో వస్తున్న వెబ్ సీరీస్ లు చాలానే ఉన్నాయి. అందులో క్రైం థ్రిల్లర్ సీరీస్ లకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి సీరీస్ లకు ఒక బెంచ్ మార్క్ గా క్రేజ్ ఎచ్చుకున్న సీరీస్ మీర్జాపూర్. ప్రైమ్ వీడియోలో ఇప్పటివరకు 3 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సీరీస్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2018 లో మీర్జాపూర్ తొలి సీజన్ రాగా ఆ టైం లో డిజిటల్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది ఈ సీరీస్. ఇక 2020 లో మరో సీజన్ వచ్చి అది కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఈ ఇయర్ కూడా మీర్జాపూర్ 3వ సీజన్ రిలీజై మంచి ప్రేక్షకాదరణ పొందింది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్రియా పిల్గోంగర్, అలీ ఫజల్ ఈ సీరీస్ లో నటించారు. గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేసిన మీర్జాపూర్ సీరీస్ లకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఈ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని మీర్జాపూర్ మేకర్స్ మీర్జాపూర్ ది ఫిల్మ్ అంటూ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈ సీరీస్ గురించి మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. మిర్జాపూర్ లో చనిపోయిన పాత్రలన్నీ మీర్జాపూర్ సినిమాలో మళ్లీ తిరిగి వస్తాయని అన్నారు. అంటే ఇది సీరీస్ కి ప్రీక్వెల్ కథగా వస్తుందని చెప్పాడు. ఈ సీరీస్ కు ప్రేక్షకుల్లో ఉన్న బజ్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీర్జాపూర్ ది ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. మీర్జాపూర్ సినిమా ను నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా బాగానే ఆదరిస్తున్నారు.

ఐతే ఈ సీరీస్ ను సినిమాగా చేస్తున్నారు కాబట్టి అది నేషనల్ వైడ్ భారీ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీర్జాపూర్ సీరీస్ అందులోని పాత్రలకు అలవాటు పడ్డ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే మంచి శుభవార్త అని చెప్పొచ్చు. మీర్జాపూర్ ది ఫిల్మ్ సినిమా క్రైం థ్రిల్లర్ లో మరో సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. ప్రైం వీడియోస్ లో సూపర్ హిట్ సీరీస్ అయిన మీర్జాపూర్ ను సినిమాగా రాబోతుండగా మరి థియేట్రికల్ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News