అలీ లేని పూరీ.. అలా చేయక తప్పలేదా..?
చివరగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా పూరీ మార్క్ చూపించలేకపోయింది.
డ్యాషింగ్ అండ్ డేరింగ్ అన్న పదాలకు పర్ఫెక్ట్ గా అనిపించే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు అందుకున్నాయి. పూరీ అడగాలే కానీ ఎలాంటి హీరో అయినా డేట్స్ ఇచ్చేవారు. ఐతే రాను రాను పూరీ ఫాం కోల్పోవడంతో స్టార్స్ ఆయన్ను కాదంటూ వస్తున్నారు. ప్రస్తుతం టైర్ 2 హీరోలతో పూరీ సినిమాలు చేస్తున్నా కూడా ఏది ఆయన రేంజ్ సక్సెస్ ఇవ్వట్లేదు. చివరగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా పూరీ మార్క్ చూపించలేకపోయింది. ఐతే సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా పూరీ మరో సినిమా చేస్తాడు.
ఇదిలాఉంటే ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో పూరీ చిరుత నచ్చిమి పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. చిరు తనయుడు రాం చరణ్ మొదటి సినిమా చిరుత. ఆ సినిమాను పూరీనే డైరెక్ట్ చేశారు. సినిమా స్క్రిప్ట్ దాదాపు పూర్తైన టైం లో బ్యాంకాక్ వెళ్లే క్రమంలో పూరీని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ ఇద్దరు సర్ నెక్స్ట్ సినిమా ఏంటి.. అలీ ఏ పాత్ర చేస్తున్నాడని అడిగారట. అప్పటిదాకా తను రాసుకున్న ఆ సినిమాలో అలీ పాత్ర రాయని పూరీ ఇలా ఇద్దరు ఒకే ప్రశ్న అడిగే సరికి అలి పాత్ర రాశాడట.
బ్యాంకాక్ వెళ్లాక అక్కడ చూసి నచ్చిమి పాత్ర రాసుకున్నట్టు పూరీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పూరీ చేసిన ప్రతి సినిమాలో అలి పాత్ర ఉంటుంది. ఉండటం అంటే అలా ఉండటం కాదు కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పూరీ అలీ కాంబో సూపర్ హిట్ అయ్యింది. చిరుతలో నచ్చిమి పాత్రలో అలి అదరగొట్టాడు. పూరీ రాసిన పాత్రలో అలీ అలా జీవించేస్తాడు. మొత్తానికి అలా చిరుత సినిమాలో అలీ పాత్ర ఎయిర్ పోర్ట్ స్టాఫ్ వల్ల రాసుకున్నాడు పూరీ. పూరీ జగన్నాథ్ రీసెంట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ లో కూడా అలీ ఉన్న విషయం తెలిసిందే.
వరుస ఫ్లాపులు పూరీ గ్రాఫ్ పడిపోయేలా చేసినా ఇప్పటికి కూడా పూరీ తిరిగి సూపర్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం పూరీ నెక్స్ట్ సినిమా కథ చర్చలు జరుగుతున్నాయి. హీరో ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. పూరీ ఖాతాలో సూపర్ హిట్ పడితే మాత్రం ఆయన కన్నా అతని ఫ్యాన్స్ ఎక్కువ సంతోషపడతారని చెప్పొచ్చు.