బులుగు సముద్రంలో ఆలియా సాహసాలు చూశారా?
అని సదరు భామలు ఇచ్చిన స్టేట్ మెంట్ ని ప్రజలు అర్థం చేసుకున్నారు.
కొత్త సంవత్సరం ప్రారంభం విదేశీ బికినీ బీచ్‌లు ఫుల్ గా రంగులమయం అయ్యాయి. బాలీవుడ్ అందాల భామలు బీచ్ ఇసుకల్లో హద్దులు చెరిపేసి చెలరేగారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ని వేడెక్కించాయి. జీవితం ఉన్నది ఒక్కటే.. దానిని తనివితీరా ఆస్వాధించు సోదరా! అని సదరు భామలు ఇచ్చిన స్టేట్ మెంట్ ని ప్రజలు అర్థం చేసుకున్నారు.
ఈసారి విదేశీ బీచ్ లను మరిగించిన వారి జాబితాలో ఆలియా భట్ పేరు కూడా ఉంది. పెళ్లయి ఒక బిడ్డకు మామ్ అయిన ఆలియా భట్ తనలో జోరు ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ తాజాగా బీచ్ వెకేషన్ లో అడ్వెంచర్స్ చేస్తూ కనిపించింది. స్విమ్ సూట్ లో ఉన్న అలియా భట్ థాయిలాండ్ లో బీచ్ వెకేషన్ మూడ్‌ని ఎక్కడా దాచుకోలేదు.
థాయ్‌లాండ్ లో అలియా భట్ కుటుంబ సమేతంగా పర్యటించింది. బీచ్ ఫోటోగ్రాఫ్స్ లో కొన్ని ఫ్రేమ్ లలో అలియా భట్ అందమైన చిరునవ్వుతో మనల్ని పలకరిస్తుంది. ఆలియా నేవీ బ్లూ స్విమ్ సూట్ ధరించి నీటిలో స్విమ్ చేసింది. అలాగే సముద్రం మధ్యలో థ్రిల్లింగ్ స్పీడ్ బోట్ రైడ్ కు వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సోదరి షాహీన్ తో ఆమె ఆన్ పాయింట్ సెల్ఫీ నిజంగా చాలా ప్రత్యేకంగా ఆకర్షించింది.
థాయ్ లాండ్ వెకేషన్‌లో తాను బస చేసిన చోట ఆలియా జిమ్ కి వెళ్లింది.. సైక్లింగ్ చేసింది. ఇక ఈ ఫోటోగ్రాఫ్స్ లోనే ఒక స్నాప్‌లో రణబీర్ కపూర్ - అలియా భట్ నుదుటిపై ముద్దు పెట్టుకుని ప్రేమను కురిపించాడు. రాహా అద్భుతమైన హావభావాలతో చుట్టూ వేవ్స్ క్రియేట్ చేసింది. బీచ్ వెకేషన్ లో క్రూయిజ్ రైడ్‌లు, సూర్యాస్తమయాలను ఆస్వాధించడం వగైరా ఎంటర్ టైన్ మెంట్ కు కొదవేమీ లేదు. ఆలియాతో పాటు బ్రహ్మాస్త్ర దర్శకనిర్మాత అయాన్ ముఖర్జీ బ్యూటిఫుల్ లొకేషన్ లో సెల్ఫీ దిగాడు. దానిపై ఆలియా ఆసక్తికర వ్యాఖ్యను షేర్ చేసారు. అలాగే ఆలియా తల్లి సోనీ రజ్దాన్ ప్రయాణ రంగులరాట్నం కూడా ఇంతకుముందు ఫోటో రూపంలో విడుదలైంది. నీతు కపూర్, ఆమె కుమార్తె రిద్దిమా కపూర్ సాహ్ని, ఆమె భర్త భరత్ సాహ్ని, వారి కుమార్తె సమారా తదితరులు వెకేషన్ లో ఉన్నారు.
అలియా భట్ చివరిసారిగా వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రా చిత్రంలో కనిపించింది. వేదంగ్ రైనా ఇందులో తన సోదరుడిగా నటించాడు. తదుపరి సంజయ్ లీలా భన్సాలీ `లవ్ & వార్` లో రణబీర్ కపూర్‌తో కలిసి ఆలియా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.