పబ్లిక్ సాక్షిగా ఆలియాకు ఊహించని షాక్
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిన చందంగా అయింది. అనూహ్యంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో స్టార్ హీరోయిన్ ఆలియా పెద్ద ఫూల్ అయింది
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిన చందంగా అయింది. అనూహ్యంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో స్టార్ హీరోయిన్ ఆలియా పెద్ద ఫూల్ అయింది. ప్రజలు ఈ భామను లైట్ తీస్కోవడం నిజంగా ఊహించని షాక్. ఇంతకీ ఈ ఘటనకు ఆస్కారం ఇచ్చిన వేదిక ఏదీ? అంటే.. పాపులర్ సంగీతకారుడు అలాన్ వాకర్ బెంగళూరు కచేరీ దీనికి వేదిక అయింది. కచేరీ మధ్యలో అలియా భట్ వేదికపై అకస్మాత్తుగా ప్రవేశించింది.. కానీ అక్కడ ప్రజలు ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు.. కనీస మాత్రంగా కూడా స్పందించలేదు. ఒక పెద్ద స్టార్ వచ్చింది అన్న ఉత్సాహం అక్కడ కనిపించకపోవడంతో ఆలియా భట్ పూర్తిగా నిశ్చేష్ఠురాలైంది. అలాన్ వాకర్ బీట్‌లకు అభిమానులు డ్యాన్స్ చేస్తుంటే షో అకస్మాత్తుగా ఆపేసి ఆలియా నటించిన `జిగ్రా` టైటిల్ ట్రాక్ ప్లే చేసారు. తన తదుపరి విడుదల జిగ్రాను ప్రమోట్ చేసే వ్యూహంలో పీఆర్ టీమ్ ఇలాంటి చెత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది పూర్తిగా మిస్ ఫైర్ అయింది. ఆడియెన్ మూడ్ ని అర్థం చేసుకోలేక వారంతా చతికిలబడ్డారు.
ఇలాంటి రాంగ్ ఐడియా ఇచ్చిన పీఆర్ ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇది నిజంగా ఆలియా లాంటి పెద్ద స్టార్ కు అవమానం. ఆమె వేదికపైకి వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఆడియెన్ నుంచి కొంచెం కూడా స్పందన రాలేదు. ఇది కొన్ని కొత్త విషయాలను బహిర్గతం చేసింది. ఆలియా భట్ కోసం వేచి చూసే ప్రత్యేక ఆడియెన్ మాత్రమే తనకు స్పందిస్తారు.. ఇతర ఆడియెన్ లేదా మ్యూజిక్ లవర్స్ అంత తేలిగ్గా స్పందించరు.
ఆలియా ప్రజ్ఞా పాటవం కేవలం బాలీవుడ్ ఇన్ సైడ్ వరకూ మాత్రమే.. ఏ జాతీయ సెలబ్రిటీ అయినా దేశంలో ఎక్కడైనా గొప్ప ఫాలోవర్స్ కావాలని కోరుకోవడం తప్పు కాదు కానీ, ఇలా ప్లానింగ్ పరమైన తప్పిదంతో అవమానానికి గురవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెంగళూరు ఈవెంట్లో చివరికి తాను ఒక అభిమానిగా అలన్ వాకర్‌ను కలుసుకున్నట్లు సమాచారం. ఇది ఊహించని ఘటన. దీనికి ఆలియా చాలా చిన్నబుచ్చుకుందని కూడా గుసగుస వినిపిస్తోంది.