మ్యాన్ ఆఫ్ మాసెస్ కి బాలీవుడ్ నుంచి దివాలీ ఆహ్వానం!

అయితే ఈసారి ఆ వేడుక‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా భాగ‌మ‌య్యే అవ‌కాశం ఉందా? అంటే అందుకు ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి.

Update: 2024-10-28 17:30 GMT

బాలీవుడ్ సెల‌బ్రిటీలు దివాలీని ఏ రేంజ్ లో సెల‌బ్రేట్ చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. స్నేహితులంతా ఒకో చేట గేద‌ర్ అయి గ్రాండ్ గా వేడుక చేసుకుంటారు. అమితాబ‌చ్చన్..క‌ర‌ణ్ జోహార్ లాంటి ఇళ్ల‌కు చేరుకుని వారితో పాటు సెల‌బ్రేష‌న్లు జ‌రుపుకుంటారు. ఇంట్లో వేడుక పూర్తయిన అనంత‌రం ఆహ్వానితుల ఇళ్ల‌కు చేరుకుని తెల్లార్లు ఎంజాయ్ చేస్తారు. అయితే ఈసారి ఆ వేడుక‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా భాగ‌మ‌య్యే అవ‌కాశం ఉందా? అంటే అందుకు ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి.

యంగ్ టైగ‌ర్ కి బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ ఎంత‌టి క్లోజ్ ప్రెండ్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. `ఆర్ ఆర్ ఆర్` తో మొద‌లైన వారి ప‌రిచ‌యం అదే స‌మ‌యంలోబ‌ల‌మైన స్నేహంగా మారింది. వాళ్ల మ‌ధ్య స్వ‌చ్ఛ‌మైన స్నేహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే? నిజంగా అన్నా-చెల్లి బాండింగ్ లాగే ఉంటుంది. `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌చారంలో భాగంగా ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌ల్లా కొట్టుకోవ‌డం...స‌ర‌దా స‌న్నివేశాలు చూసి అభిమానులెంతో ముచ్చ‌ట ప‌డ్డారు.

నిజంగా తార‌క్ కి చెల్లి ఉంటే ఇంతే స‌ర‌దాగా ఉండేవాడు అనిపించింది. అయితే ఇప్పుడు తార‌క్ కి అలియా భట్ నుంచి దివాలీ ఆహ్వానం అందిన‌ట్లు స‌మాచారం. కుటుంబ స‌మేతంగా ముంబైలోకి త‌న ఇంటికి రావాల‌ని అలియాభ‌ట్ దంపతులు తార‌క్ దంపతుల్ని ఆహ్వానించిన‌ట్లు వినిపిస్తుంది. దీపావ‌ళి పండుగ‌ను త‌మ‌తో పాటు సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి అదే నిజ‌మై తార‌క్ వెళ్తే గ‌నుక ఆ రోజు ఆ సెల‌బ్రేష‌న్ అన్న‌ది అక్క‌డితో ఆగ‌దు.

చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలతో వేడుక చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం తార‌క్ కూడా `వార్ -2`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టిస్తున్నాడు. అలా ఇప్ప‌టికే సెట్స్ లో అక్క‌డా చాలా మంది స్నేహితులు ఏర్ప‌డ్డారు. అల‌వాటైతే తార‌క్ ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసిపోతాడు. మ‌రి ఈసారి దివాలీ ఎక్క‌డ సెల‌బ్రేట్ చేస్తాడో? చూడాలి.

Tags:    

Similar News