యంగ్ టైగర్ ఇంట్లోనే అలియాభట్-రణబీర్ డిన్నర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్-బాలీవుడ్ నటి అలియాభట్ ఎంత క్లోజ్ ప్రెండ్స్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-బాలీవుడ్ నటి అలియాభట్ ఎంత క్లోజ్ ప్రెండ్స్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి చేసింది ఒక్క సినిమా అయినా? అయినా క్లోజ్ అవ్వడానికి సంవత్సరాలు అవసరం లేదని నిరూపించారు. అయినా ఆ సినిమాలో అలియాభట్ తారక్ కి పెయిర్ గానూ నటించలేదు. కేవలం కాంబి నేషన్ లో కొన్ని సన్నివేశాలే చేసారు. కానీ వాళ్లద్దరు మంచి స్నేహితులయ్యారు.
ఈ సంగతంతా `ఆర్ ఆర్ ఆర్` ప్రచారం సమయంలో ఇద్దరు సరదాగా కొట్టుకుంటోన్న సమయంలో అర్దమైంది. తారక్ లాగే అలియాభట్ కూడా అందరితో ఇట్లో కలిసి పోయే స్వభావం కలది కాబట్టే సాధ్యమైంది. సరిగ్గా ఇదే బాండింగ్ అలియాభట్ జోడీని తారక్ ఇంటి వరకూ తీసుకొచ్చింది. అవును రణబీర్ కపూర్ -అలియాభట్ జంటగా నటించిన `బ్రహ్మాస్త్ర `ప్రమోషన్ కోసం హైదరాబాద్ రావడం..తెలుగు టీవీ ఛానెల్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గోనడం జరిగింది.
ఆ సినిమాని నాగార్జున, రాజమౌళి , తారక్ ప్రమోట్ చేసారు. అయితే ముంబై నుంచి హైదరాబాద్ కి వస్తున్నట్లు? అలియాభట్ తారక్ కి ఫోన్ చేసి చెప్పగానే నేరుగా ఇంటికే వచ్చేయమని చెప్పాడుట తారక్. దీంతో ఆయన మాట కాదనలేక సాయంత్రానికే రణబీర్ జోడీ తారక్ ఇంటికి చేరుకుంది. ఇలా అతిధులు ఎవరైనా ఇంటికి చేరుకుంటే తారక్ కామ్ గా ఉంటాడా? చేతి వాటం చూపించడు.
తన స్టైల్ బిర్యానీ చేసి వడ్డించేస్తాడుట. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకున్న తర్వాత ఆకుటుంబంతో ఆ రాత్రి ఎంతో సరదాగా గడిపినట్లు అలిభట్ రివీల్ చేసింది. హైదరాబాద్ లో తారక్ తనకు మంచి స్నేహితుడని..ఇక్కడ ఉండాల్సి వస్తే హోటల్స్ అవసరం లేదని..నేరుగా తారక్ ఇంటికే వెళ్లిపోవచ్చు అని చెప్పుకొచ్చింది.