భార్యభర్తల మధ్య లవ్ అండ్ వార్ మొదలు!
`బ్రహ్మాస్త్ర` లో రణబీర్ కపూర్ -అలియాభట్ అలరించిన సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే.
`బ్రహ్మాస్త్ర` లో రణబీర్ కపూర్ -అలియాభట్ అలరించిన సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే. దీంతో ఈ జోడీ మళ్లీ ఎప్పుడు జతకడుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణంలో ఆ జోడీని కలపడానికి సంజయ్ లీలా భన్సాలీ సిద్దపడ్డారు. ఈ ముగ్గురి కాంబినేషన్ `లవ్ అండ్ వార్` టైటిల్ తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియల్ జోడీని రీల్ పై ఎలా చూపిం చబోతున్నారు? అన్న ఉత్కంఠ మొదలైంది.
కానీ రణబీర్ కపూర్ `రామాయణ్` లో ఉండటంతో ఇప్పట్లో సినిమా పట్టాలెక్కుతుందా? అన్న సందేహం అందరిలో ఉంది. కానీ సంజయ్ లీలా భన్సాలీ మాత్రం అంత సమయం తీసుకోలేదు. ఈ చిత్రాన్ని అతి త్వరలోనే పట్టా లెక్కించే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గనుక ఆగస్టులోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సంజయ్ ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్ పైనే పనిచేస్తున్నారు.
`హార్ట్ ఆఫ్ స్టోన్` తర్వాత అలియాభట్ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసింది లేదు. నిర్మాతగా `జిగ్రా` అనే సినిమా చేస్తుంది. అది తప్ప అలియా మరే సినిమాకి కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో అలియాభట్ డేట్లు సమస్య ఉండదు. రణబీర్ కపూర్ డేట్లు కేటాయిస్తే! పట్టాలెక్కించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమా కంటే ముందే షారుక్ ఖాన్ హీరోగా `ఇన్షా అల్లా` అనే చిత్రాన్ని ప్రకటించారు. దాన్నే ముందుగా పట్టా లెక్కించాలనుకున్నారు.
కానీ ఆ సినిమా షూటింగ్ కి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో భన్సాలీ ప్లాన్ మార్చి `వార్ అండ్ లవ్` ని ముందుగా సెట్స్ కి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భన్సాలీ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ `హీరామండి` రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.