ఇద్ద‌రి మ‌ధ్య ఆ ఆట త‌గ్గాప్ వార్!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులెడుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-30 07:30 GMT

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులెడుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని విడిచి పెట్ట‌డం లేదు. నో అనుకుండా క‌మిట్ అవుతుంది. అందుకు త‌గ్గ‌ట్టే శ్ర‌మిస్తుంది. సినిమాకి త‌న వైపు అన్ని ర‌కాలుగా ది బెస్ట్ ఇవ్వ‌డానికి నిరంత‌రం తపిస్తుంది. దీంతో అమ్మ‌డు ద‌ర్శ‌కుడు చెప్ప‌క‌ముందే న‌టిగా త‌న‌ని తాను సిద్దం చేసుకుంటుంది.

ఇప్ప‌టికే అలియా భ‌ట్ మార్ష‌ల్ ఆర్స్ట్ లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అవ‌స‌రం మేర చైనా వెళ్లి మ‌రీ ఆ ట్రైనింగ్ పూర్తి చేసింది. అంత‌కు ముందు ఓ హాలీవుడ్ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేకంగా స‌న్న‌ధ‌మైంది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో దానికి సంబంధించిన శిక్ష‌ణ కూడా పూర్తి చేసింది. తాజాగా అమ్మ‌డు బాస్కెట్ బాల్ సైతం నేర్చుకున్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది.

వాస‌న్ బాలా తెర‌కెక్క‌స్తోన్న `జిగ్రా`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సోద‌రుడిని కాపాడుకోవ‌డం కోసం ఓ అక్క చేసిన పోరాట‌మే ఈసినిమా క‌థ‌. వేదాంగ్ రైనా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఈనేప‌థ్యంలో సినిమా అప్డేట్స్ వివ‌రిస్తూ ఈ సినిమా కోసం తానేం నేర్చ‌కుందో రివీల్ చేసింది. ఈ సినిమా క‌థ‌కి..బాస్కెట్ బాల్ గేమ్ కి సంబంధం ఉంది.

ఇందులో బాస్కెట్ బాల్ స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. బాస్కెట్ బాల్ స‌న్నివేశాల్లో ప్ర‌త్య‌ర్ధి వేదాంగ్ తోనే పోటీ ప‌డుతుందిట అలియాభ‌ట్. ఇద్ద‌రి మ‌ధ్య ఆ ఆట త‌గ్గాప్ వార్ గా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. అన్నిప‌నులు పూర్తిచేసుకుని ఆగ‌స్టు 11న రిలీజ్ కానుంది. క‌ర‌ణ్ జోహార్ -అపూర్వ మెహ‌తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News