భర్త రణబీర్ విషపూరితం.. కామెంట్లకు ఆలియా చెక్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అలియా భట్.. తన భర్త-నటుడు రణబీర్ కపూర్ తన సహజమైన పెదవుల రంగును ఇష్టపడినందున లిప్‌స్టిక్‌ను తుడిచివేయమని సూచించాడని పేర్కొంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అలియా భట్.. తన భర్త-నటుడు రణబీర్ కపూర్ తన సహజమైన పెదవుల రంగును ఇష్టపడినందున లిప్‌స్టిక్‌ను తుడిచివేయమని సూచించాడని పేర్కొంది. ఆలియా వ్యాఖ్య అనంతరం రణబీర్ ఆన్లైన్లో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. టాక్సిక్ పార్టనర్ అంటూ అతడిని వర్ణించారు. `కాఫీ విత్ కరణ్ 8` ఎపిసోడ్ లో ఆలియా భట్ చివరకు అదే విషయంపై తన మౌనాన్ని వీడింది.
రణబీర్ గురించి అలియా చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో ఎందుకు బ్లాస్ట్ అయ్యాయని కరణ్ జోహార్ ఆరా తీసారు. రణబీర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేనందున అతడి గురించి తాను చేసే ఏ వ్యాఖ్యలైనా .. ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయని ఆలియా వ్యాఖ్యానించింది. నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడతాను. కాబట్టి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వారిని అనుకరించడానికి ఇష్టపడతాను. నాకు కథలు చెప్పడం ఇష్టం. నేను వ్యక్తిగత విషయాలు చెబుతాను`` అని ఆలియా వ్యాఖ్యానించింది.
రణ్‌బీర్ ను విషపూరిత వ్యక్తిగా పేర్కొనడంపై అలియా స్పందించింది. ఒక వీడియో చూసి ఒక ఉదాహరణను ఉటంకిస్తూ.. ఇలా విమర్శించడం సరికాదని ఆలియా పేర్కొంది. ఆ వ్యాఖ్యలు చూసి తన బృందం అప్రమత్తం చేసింది. మొదట్లో సరే వదిలేయండి అని అనుకుంది. ఎందుకంటే తన బృందం తరచూ ఇలాంటి వాటి గురించి తనవద్ద ప్రస్తావిస్తుంది. అయితే రణబీర్ ని విషపూరితమైన వ్యక్తిగా చిత్రీకరిస్తూ సీరియస్ కథనాలు వైరల్ అయ్యాయని తెలుసుకున్నప్పుడు ఇక ఆగలేకపోయాను.. అని తెలిపింది.
ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్రపంచంలోని అనేక సమస్యల గురించి శ్రద్ధ వహించండి. చాలా విషయాలు ఉన్నాయి. రణబీర్ ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆలియా పేర్కొంది. చెడుగా భావించడం మాత్రమే కాదు.. ప్రజలు అతడిని తప్పుగా అర్థం చేసుకోవడం నచ్చలేదు. ఎందుకంటే అతడు వాటన్నింటికీ నిజమైన వ్యతిరేకి అని ఆలియా వ్యాఖ్యానించింది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8 గురించి..
కరణ్ జోహార్ హోస్ట్ చేసిన టాక్ షోలో ఇప్పటికే రణవీర్ సింగ్-దీపికా పదుకొనే, సన్నీ డియోల్-బాబీ డియోల్ .. సారా అలీ ఖాన్-అనన్య పాండే జంటలు సోఫాలో కనిపించారు. తదుపరి ఎపిసోడ్ల కోసం మరింత ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాజోల్-రాణి ముఖర్జీ .. అజయ్ దేవగన్-రోహిత్ శెట్టి కూడా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంటున్నారు. సీజన్ 8 ఇప్పుడు Disney+ Hotstarలో చూడటానికి అందుబాటులో ఉంది.