సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ గురించి ఈ విషయాలు తెలుసా...?
తాజాగా ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేలం లో కావ్య మారన్ పాల్గొన్నారు. చాలా దూకుడుగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాంతో మరోసారి కావ్య మేడం పేరు వార్తల్లో నిలిచింది.
సోషల్ మీడియాలో హీరోయిన్స్ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న వ్యక్తి కావ్య మారన్. ఈమె ఐపీఎల్ జరుగుతున్న ప్రతి సారి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా కావ్య మారన్ ను చూడవచ్చు. ఆమె ఐపీఎల్ జట్టు సన్ రైజన్స్ సీఈఓ అనే విషయం తెల్సిందే.
తాజాగా ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేలం లో కావ్య మారన్ పాల్గొన్నారు. చాలా దూకుడుగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాంతో మరోసారి కావ్య మేడం పేరు వార్తల్లో నిలిచింది. తమిళనాడుకు చెందిన కావ్య మారన్ చాలా మంది హీరోయిన్స్ కంటే మరింత అందంగా ఉంటారు అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.
తమిళనాడు మీడియా మొఘల్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ 2018 లో సన్ రైజర్స్ బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ప్రతి మ్యాచ్ లో కూడా ఆమె కనిపిస్తూ ఉన్నారు. జట్టు ను వెనుక ఉండి నడిపించడంతో పాటు, జట్టుకు ఓటమిలో వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు.
ఇప్పుడు ఆమె ఆస్తి వివరాలు, నికర ఆదాయం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కావ్య మారన్ ఆస్తి నికర విలువ రూ.409 కోట్లు గా తెలుస్తోంది.ఇక ఆమె తండ్రి ఆస్తి గురించి చెప్పాలిసిన అవసరం లేదు కొన్ని వేల కోట్లు ఆస్థిపరుడు.
1992 లో కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులకు జన్మించిన కావ్య మారన్ ఉన్నత చదువులు చదివి తన తండ్రి వ్యాపార సామ్రాజ్యం లో అడుగు పెట్టింది. మీడియా తో పాటు క్రికెట్ పై ఆసక్తితో ఐపీఎల్ ప్రాంచైజీ బాధ్యతలను కావ్య మారన్ చూసుకుంటూ ఉన్నారు