పాన్ ఇండియాలో అల్లరి నరేష్ స్పూప్ స్టోరీ!
రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ సహా టైర్ హీరోలు నిఖిల్, నాని ఇలా హీరోలంతా పాన్ ఇండియాని టార్గెట్ చేసి ముందుకెళ్తున్నారు.
టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలంతా పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ సహా టైర్ హీరోలు నిఖిల్, నాని ఇలా హీరోలంతా పాన్ ఇండియాని టార్గెట్ చేసి ముందుకెళ్తున్నారు. మరి ఇండియాని షేక్ చేయడానికి నరేష్ అలియాస్ అల్లరి ఎప్పుడు బరిలోకి దిగుతుంది? అంటే నేను కూడా రెడీ అంటున్నాడు అల్లరి నరేష్. నరేష్ కామెడీ సినిమాలు తగ్గించి వైవిథ్యమైన పాత్రల వైపు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత గాడి తప్పిన సంగతి తెలిసిందే.
స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన చిత్రాల వరకూ బాగానే ఆడుతున్నాయి. కానీ సోలోగా సీరియస్ రోల్స్ చేస్తే మాత్రం పనవ్వడం లేదు. అలాగని నరేష్ కామెడీ చిత్రాలకు దూరంగా కాలేదు. కథలు కుదరకపోవడంతో చేయలేక పోతు న్నాడు. ఇక అల్లరి నరేష్ కెరీర్ లో సుడిగాడు అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈసినిమాకి సీక్వెల్ గా సుడిగాడు-2 కూడా ప్రకటించారు. అయితే ఇంతవరకూ ఈ చిత్రాన్ని పట్టాలెక్కించలేదు.
కానీ ఇప్పుడు `సుడిగాడు -2`ని ఏకంగా పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నాడు. అన్ని భాషల ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వడించడానికి తనదైన మార్క్ లో రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాలన్నింటిని కలిపి ఓ స్పూప్ లా చేసి `సుడిగాడు-2` చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ కథ సిద్దం అవ్వడానికి చాలా సమయం పడుతుంద న్నాడు. సుడిగాడు కథ రాయడానికే 15 నెలలు సమయం పట్టిందని.. సుడిగాడు 2 రాయడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు అన్నాడు.
2026లో సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని అంచనాగా చెప్పుకొచ్చాడు. అయితే ఆలస్యానికి ఓ ప్రత్యే క కారణం చెప్పాడు. సుడిగాడు చిత్రం హిందీలో రిలీజ్ అయినప్పుడు అందులో సంభాషణలు అర్దం కాక. అది స్పూప్ అని తెలియక హిందీ ప్రేక్షకులు గందర గోళానికి గురయ్యారు. దక్షిణాది సినిమాలంటే ఇలా ఉంటాయా? అని మాట్లాడుకున్నారు. ఈసారి అలాంటి కామెంట్లు రాకూడదనే ఎక్కువ సమయం తీసుకుని కథ రాస్తున్నట్లు తెలిపారు.