ఛాలెంజింగ్ సీక్వెల్‌ను ప్రకటించిన 'సుడిగాడు'
నాని హీరోగా రూపొందిన 'బచ్చల మల్లి' డిసెంబర్ 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నాని హీరోగా రూపొందిన 'బచ్చల మల్లి' డిసెంబర్ 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలు ఉండగానే ప్రమోషన్స్‌తో దుమ్ము రేపుతున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా అల్లరి నరేష్, ఇతర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. మీడియా సమావేశం విభిన్నంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు నులక మంచం మీద కూర్చుని తాపీగా మీడియాతో మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమా ప్రెస్ మీట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ సమయంలోనే సుడిగాడు సీక్వెల్‌పై ప్రకటన చేయడం జరిగింది.
అల్లరి సినిమాతో కెరీర్‌ను ఆరంభించి ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లరి నరేష్‌గా మారిపోయాడు. అల్లరి నరేష్ కెరీర్ ఆరంభంలో కొన్నాళ్ల పాటు ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్టు సాగింది. సుడిగాడు సినిమాతో కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌ను సొంతం చేసుకోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత అల్లరి నరేష్ చేసిన ప్రతి సినిమా డిజాస్టర్‌గా నిలుస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ సినిమా వస్తుంది అంటే జనాలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో అల్లరి నరేష్ తన పంథాను మార్చి 'నాంది' వంటి సీరియస్ సినిమాలను చేయడం మొదలు పెట్టారు.
హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను సినిమాలు చేయాలని భావించారు. నాందితో సూపర్ హిట్ దక్కించుకోవడంతో సీరియస్ పాత్రలు చేయడం మొదలు పెట్టాడు. అయితే సీరియస్‌గా నటించడం వల్ల పెద్ద విజయాలు దక్కడం లేదని అల్లరి నరేష్ గ్రహించినట్లు ఉన్నాడు. అందుకే మళ్లీ కామెడీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితులతో కామెడీ స్క్రిప్ట్‌లను రెడీ చేయమని చెప్పాడట. అంతే కాకుండా కామెడీ పాత్రలను కొత్తగా ఈతరం ప్రేక్షకులకు నచ్చే విధంగా రాయమని సన్నిహితులతో చెప్పాడని సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఆయన సుడిగాడు సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు.
కొన్నాళ్ల క్రితమే సూపర హిట్ మూవీ సుడిగాడు కి సీక్వెల్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ సుడిగాడు కామెడీ ఇప్పుడు సెట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాంటి కామెడీతో వస్తే ట్రోల్స్ మెటీరియల్ అవుతామని అల్లరి నరేష్‌కి తెలుసు. అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేసిన అల్లరోడు ఇప్పుడు మాత్రం తన హిట్ మూవీ సుడిగాడు కి సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అంతే కాకుండా 2026 లో ఆ సినిమా ఉంటుందని సైతం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సినిమాల్లో కామెడీ డిఫరెంట్‌గా ఉండాలి, అలా కాదంటే బొక్క బోర్లా పడతారు. అందుకు తగ్గట్లుగా సుడిగాడు ఉంటుందా అనేది చూడాలి.