.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

సడెన్ గా చూస్తే పుష్ప అనుకునేరు!

తాజాగా ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. రేపు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Update: 2024-06-29 07:58 GMT

పై ఫోటో చూస్తే పుష్ప సీక్వెల్ కు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్ వచ్చిందనుకున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న పుష్ప-2 మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి ఈ లుక్ ఎవరిదా అని ఆలోచిస్తున్నారా? ఆయనెవరో కాదు.. తన రూట్ మార్చుకుని సరికొత్త కాన్సెప్ట్ లతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ది.

అవును నిజమే.. అల్లరి నరేష్ దే. ప్రస్తుతం ఆయన బచ్చలమల్లి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుబ్బు మంగాదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. అతడు పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసే పని ట్రాక్టర్ డ్రైవింగ్ అంటూ క్యారెక్టర్ ను రివీల్ చేశారు.

 

ప్రస్తుతం బచ్చలమల్లి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. రేపు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. "నరేష్ గారి పుట్టినరోజు రోజు, బచ్చలమల్లి మీ అందరినీ పలకరిస్తాడు, హ్యాపీ బర్త్‌ డే చెప్పడానికి రెడీగా ఉండండి, స్పెషల్ బర్త్‌ డే గ్లింప్స్ రేపు ఉదయం 9 గంటలకు" అంటూ పోస్ట్ చేశారు. దీంతో పాటు వేరే లెవల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Read more!

ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్ చూసి అంతా అల్లు అర్జున్ అనుకుంటున్నారు. పుష్ప రాజ్ అని ఏమో డౌట్ గా చూస్తున్నారు. అచ్చం బన్నీ లాగే అల్లరి నరేష్ ఉన్నారని అంటున్నారు. మొత్తానికి బచ్చలమల్లి సినిమా కోసం అల్లరి నరేష్ ఎలా మేకోవర్ చేసుకున్నారో క్లారిటీ వచ్చేసింది. గుబురు గడ్డం, జుట్టుతో ఊర మాస్ లుక్ లో ఆయన అదిరిపోయారని నెటిజన్లు చెబుతున్నారు. గ్లింప్స్ కూడా ఓ రేంజ్ లో ఉండనుందని అంటున్నారు.

ఇక బచ్చలమల్లి సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరాం, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మరి రేపు మేకర్స్ రిలీజ్ చేసే గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News