2 నిమిషాల్లో ఫుల్‌... బన్నీ ఖాతాలో అరుదైన రికార్డ్‌

ఈనెల 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే. దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ బన్నీ బర్త్‌డేను వైభవంగా జరుపుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు.;

Update: 2025-04-02 13:25 GMT
2 నిమిషాల్లో ఫుల్‌... బన్నీ ఖాతాలో అరుదైన రికార్డ్‌

అల్లు అర్జున్‌ పుష్ప ప్రాంచైజీతో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా పుష్ప 2 సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో పుష్ప 2 సినిమా సాధించిన వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీ సినిమాలకు సైతం సాధ్యం కాని రూ.1000 కోట్ల వసూళ్లను సునాయాసంగా రాబట్టింది. తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డ్‌లు సృష్టించిన విషయం తెల్సిందే. పుష్ప 2 తర్వాత బన్నీ కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అయినా కూడా మరో అరుదైన రికార్డ్‌ అల్లు అర్జున్‌ ఖాతాలో వచ్చి పడింది. దాంతో అభిమానులు ఫుల్‌గా చిల్‌ అవుతున్నారు.

ఈనెల 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే. దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ బన్నీ బర్త్‌డేను వైభవంగా జరుపుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. బర్త్‌ డే సందర్భంగా బన్నీ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ 'ఆర్య 2' ను రీ రిలీజ్‌ చేయబోతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్‌, కాజల్‌ అగర్వాల్‌, నవదీప్‌లు నటించారు. విభిన్నమైన ప్రేమ కథా చిత్రంగా ఆర్య 2 ఉంటుంది. అప్పట్లో హిందీలో థియేట్రికల్‌ రిలీజ్ కాలేదు. కానీ శాటిలైట్ ఛానల్స్ ఓటీటీ ద్వారా ఆర్య 2 హిందీ వర్షన్ నార్త్‌ ఇండియన్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయినా కూడా అక్కడ కూడా ఆర్య 2 ను థియేట్రికల్‌ రిలీజ్‌కి అఉవుగా డబ్‌ చేసి రీ రిలీజ్ కి ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

హిందీ వర్షన్‌ విషయం పక్కన పెడితే ఆర్య 2 తెలుగు వర్షన్‌ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది. నిన్న రీ రిలీజ్‌కి సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ ఆర్య 2 సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. బుకింగ్‌ ప్రారంభం అయిన వెంటనే సంధ్య థియేటర్‌లోని టికెట్లు అన్ని బుక్ అయ్యాయి. ఆశ్చర్యకరంగా కేవలం 2 నిమిషాల్లోనే అన్ని టికెట్లు బుక్ అయ్యాయి అంటూ బుక్ మై షో పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో రీ రిలీజ్‌ లు చూశాం.. కానీ అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ స్పీడ్‌ కచ్చితంగా అరుదైన రికార్డ్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

15 ఏళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్య 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లోనే రికార్డ్‌ నమోదు చేస్తే, రి రిలీజ్ తర్వాత వసూళ్లతో మరింతగా రికార్డ్‌లు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ బన్నీ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. పుష్ప 2 సినిమాతో బన్నీ స్థాయి అమాంతం పెరిగింది. బన్నీ స్టార్‌డంను మరోసారి నిరూపించే విధంగా ఆర్య 2 సినిమా రీ రిలీజ్ వసూళ్లు ఉండబోతున్నాయి అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు చాలానే ఉండగా ఆర్య 2 నే విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది కొందరి ప్రశ్న. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా పుష్ప 2 వచ్చి భారీ విజయంను సొంతం చేసుకున్న ఈ సమయంలో వీరిద్దరి కాంబోలోనే వచ్చిన సినిమా రీ రిలీజ్ అయితే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

Tags:    

Similar News