IMDb టాప్ 10 జాబితాలో అల్లు అర్జున్-శ్రీలీల!
ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల ఇప్పుడు ప్రఖ్యాత ఐఎండిబి టాప్ 10 జాబితాలో అగ్రపథాన నిలిచారు.
పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల ఇప్పుడు ప్రఖ్యాత ఐఎండిబి టాప్ 10 జాబితాలో అగ్రపథాన నిలిచారు. పుష్ప 2 విడుదలైన రెండో వారంలోను బాక్సాఫీస్ వద్ద హవా సాగిస్తోంది. అదే సమయంలో ఇందులో నటించిన స్టార్ల పేర్లు మార్మోగుతున్నాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల తమ అద్భుత ప్రదర్శనలతో ప్రజల దృష్టిని ఆకర్షించడంతో ఐఎండిబి 'లిస్ట్ ఆఫ్ ది వీక్' జాబితాలో నిలిచారు. అంతకంతకు వారికి పెరుగుతున్న జనాదరణను ఇది ప్రతిబింబిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ IMDb అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో పుష్ప 2లో 'కిస్సిక్' పాటతో సంచలనం సృష్టించిన శ్రీలీల, ఐదవ స్థానంలో పుష్ప 2 కథానాయిక(శ్రీవల్లి పాత్రధారి) రష్మిక మందన్న ఉన్నారు.
ఈ జాబితాలో 'యానిమల్' బ్యూటీ ట్రిప్తి దిమ్రీ నం.1 గా రికార్డులకెక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్, సాయిపల్లవి, ఆలియా భట్, దీపిక పదుకొనే, శివకార్తికేయన్, వామికా గబ్బి తదితరులు టాప్ 10 జాబితాలో ఉన్నారు.
2024లో ఐఎండిబి టాప్ 10 అత్యంత జనాదరణ పొందిన భారతీయ స్టార్స్ లో వీక్లీ ర్యాంకింగ్స్‌లో స్థిరంగా అత్యధిక ర్యాంక్‌ను పొందిన స్టార్‌లు ఉన్నారు. ఈ ర్యాంకింగ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా రూపొందించారు.