బాలీవుడ్‌లోనూ డబ్ చేసి రీ రిలీజ్ చేస్తారా?
2009లో విడుదలైన ఆర్య 2 సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'ఆర్య' తర్వాత వచ్చిన ఆర్య 2 సక్సెస్‌ను సొంతం చేసుకుంది.;

టాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో సినిమా రి రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 4న బాలకృష్ణ నటించిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' ను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చిన వారం రోజుల గ్యాప్‌లోనే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ 'ఆర్య 2' ను రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్య 2 సినిమాను 4కే రిజల్యూషన్ వర్క్ ముగింపు దశకు చేరుకున్నాయి. సౌండ్ విషయంలోనూ రాజీ పడకుండా కొత్త టెక్నాలజీతో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా 'ఆర్య 2' సినిమా రీ రిలీజ్ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆసక్తికర విషయం ఏంటంటే ఆర్య 2 ను తెలుగుతో పాటు హిందీలోనూ రీ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
2009లో విడుదలైన ఆర్య 2 సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'ఆర్య' తర్వాత వచ్చిన ఆర్య 2 సక్సెస్‌ను సొంతం చేసుకుంది. విభిన్నమైన ప్రేమ కథా చిత్రంగా వచ్చిన ఆర్య 2 సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేసినా కచ్చితంగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతర హీరోల సినిమాల మాదిరిగా బన్నీ సినిమాలను ఎక్కువగా రీ రిలీజ్ చేయలేదు. కనుక ఆర్య 2 సినిమా రీ రిలీజ్ విషయమై కచ్చితంగా ఫ్యాన్స్‌లో పాజిటివ్ బజ్ ఉంది. ఫ్యాన్స్‌లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సైతం ఆర్య 2 రీ రిలీజ్‌పై ఆసక్తి కనబర్చుతున్నారు.
పుష్ప 2 సినిమాతో నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మూవీ 'ఆర్య 2' కావడంతో అక్కడ కూడా రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హిందీలో ఆర్య 2 ఇప్పటికే బుల్లి తెర ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఎన్నో సార్లు అక్కడి ప్రేక్షకులు చూసే ఉంటారు. అయినా కూడా హిందీలో ఆర్య 2 సినిమాను డబ్ చేసి రీ రిలీజ్ చేస్తే హిట్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, అక్కడ భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు, బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు భావిస్తున్నారు. అందుకే మరోసారి హిందీ లో డబ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కి పుష్ప ప్రాంచైజీతో నార్త్ ఇండియాలో బాలీవుడ్ హీరోల స్థాయి ఇమేజ్ దక్కింది. అందుకే ఇక ముందు అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా హిందీ సినిమాల స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అనే పేరు ఒక బ్రాండ్ ఇమేజ్‌ను నార్త్ ఇండియాలో సొంతం చేసుకున్న కారణంగా ఆర్య 2 ను రీ రిలీజ్ చేయడం అనేది మంచి బిజినెస్ ఐడియా అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పుష్ప కాంబోలో రూపొందిన సినిమా రీ రిలీజ్ అంటూ ప్రచారం చేయడం ద్వారా అక్కడ మినిమం వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆ సినిమా ఉంటుంది కనుక లాంగ్ రన్‌లోనూ వసూళ్లు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయాలని భావించినప్పటికీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో అట్లీ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్ 8న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని అట్లీ భావిస్తున్నాడట. ఇదే ఏడాది చివర్లో త్రివిక్రమ్ దర్శకత్వలో బన్నీ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.