సరైన గైడ్ లేకపోతే మంచి నటుడైనా ప్రమాదంలోకి.. బన్ని కామెంట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందించిన `పుష్ప 2: ది రూల్` ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1,800 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందించిన `పుష్ప 2: ది రూల్` ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1,800 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆల్ టైమ్ బెస్ట్ గ్రాసర్స్ లో భారతదేశం నుంచి రెండో సినిమా ఇది. అలాగే `పుష్ప` చిత్రంతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీ కోసం ఐదేళ్ల పాటు సుకుమార్ ని ఫాలో అయిపోయాడు బన్ని. పుష్ప 2 బృందం ఈ శనివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, అల్లు అర్జున్ తన అభిమానులకు ఒక హామీ ఇచ్చాడు.
నేను ఈ విజయాన్ని నా సైన్యానికి అంకితమిస్తున్నానని బన్ని అన్నారు. నేను నా సైన్యాన్ని ప్రేమిస్తున్నాను. మీ అందరినీ పిచ్చిగా, నన్ను చూసి గర్వపడేలా చేయాలనుకున్నాను. `పుష్ప 2`ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు సరిపోవు. నాకు మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు`` అని అన్నారు. పుష్ప 2 చారిత్రాత్మక విజయానికి అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్నేహం గొప్పతనాన్ని ఈ వేదికపై బన్ని ఆవిష్కరించారు.
మేమంతా అతడి(సుకుమార్) కలల నుండి పుట్టిన పాత్రలం మాత్రమే. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని చూసి గర్విస్తోంది. సుకుమార్ ఒక వ్యక్తి కాదు.. ఆయన ఒక భావోద్వేగం. మా జీవితాలను అర్థవంతం చేసినందుకు ధన్యవాదాలు సుకుమార్ గారు.. అని ఎమోషనల్ అయ్యాడు బన్ని. సరైన మార్గదర్శకత్వం లేకపోతే ఒక మంచి నటుడు బ్యాడ్ యాక్టర్‌గా మారే ప్రమాదం ఉందని.. అలా సుకుమార్ పరిచయం తనను ఈ స్థాయికి చేర్చిందని కూడా బన్ని థాంక్స్ మీట్ లో అన్నారు. ఈ బ్లాక్ బస్టర్ విజయానికి క్రెడిట్ పూర్తిగా సుకుమార్‌కే చెందుతుందని బన్ని అన్నారు. ఐదేళ్లుగా సుకుమార్ ని పిచ్చోళ్లలా ఫాలో అయ్యామని కూడా బన్ని సరదాగా వ్యాఖ్యానించాడు. `పుష్ప- 3` గురించి అల్లు అర్జున్ వ్యాఖ్యానిస్తూ.. మా ఇద్దరికీ తెలియదు.. కానీ అది అద్భుతమైన శక్తి! అని ఐకాన్ స్టార్ అన్నారు. పుష్ప 3 గురించి ఆలోచించే ముందు సుకుమార్ కానీ, బన్ని కానీ కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.