అట్లీ - అల్లు అర్జున్.. ఇది మామూలు రిస్క్ కాదు!
సినిమా అసలు ల్యాగ్ అనే పాయింట్ లేకుండా ఉంటేనే ఈ రకమైన టార్గెట్స్ ను అందుకునే అవకాశం ఉంటుంది. టాక్ కాస్త తేడా వచ్చినా కలెక్షన్లు స్లో అవుతాయి.;

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ‘AA22 X A6’ గురించి ఈ మధ్య బజ్ ఊహించని స్థాయికి చేరింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి అప్డేట్ నుంచే నుంచే ఫ్యాన్స్ లో భారీ హైప్ ని క్రియేట్ చేస్తోంది. కానీ ఈ సినిమా వెనుక ఉన్న అసలు ఫిగర్స్ చూసే సరికి ఫిల్మ్ లవర్స్, ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఓ సినిమా కాదు.. ఒక ఇండస్ట్రీ స్థాయి రిస్క్.
ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఏకంగా రూ.800 కోట్లు. ఇది దేశంలో ఇప్పటివరకు నిర్మితమవుతున్న రెండో అతిపెద్ద బడ్జెట్ సినిమా. మొదటిది రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న రూ.1000 కోట్ల ప్రాజెక్ట్. ఇంత భారీ పెట్టుబడి పెట్టిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. కనీసం రూ.1600 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇండియన్ మార్కెట్ లోనే. ఇది ఊహించదగిన సంఖ్య కాదు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ హోల్డర్ ‘పుష్ప 2’ కూడా 1265 కోట్ల వరకే వచ్చింది.
ఒకవేళ ఈ సినిమా 1600 కోట్లు టచ్ అయితే, అది ఇండియన్ సినిమా చరిత్రలోనే సంచలనం అవుతుంది. అల్లు అర్జున్ మార్కెట్ ఇప్పటికే ‘పుష్ప’ 2 తో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. అదే సమయంలో అట్లీకి కూడా ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈసారి వీళ్లిద్దరూ కలిస్తే సాధ్యమవుతుందా? అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న.
సినిమా అసలు ల్యాగ్ అనే పాయింట్ లేకుండా ఉంటేనే ఈ రకమైన టార్గెట్స్ ను అందుకునే అవకాశం ఉంటుంది. టాక్ కాస్త తేడా వచ్చినా కలెక్షన్లు స్లో అవుతాయి. దీంతో పాటు, సోషల్ మీడియాలో సినిమా మీద ఎలాంటి నెగటివ్ బజ్ లేకుండా నడిపించడం కూడా చాలా కీలకం. ఈ సినిమా కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో మిక్స్ అయిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అంటున్నారు. అంటే మాస్ ప్లస్ క్లాస్ కలయిక కచ్చితమే.
ఇక ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఇలాంటి హై బడ్జెట్ ప్రయోగాలకు నిర్మాతలు భయపడే ప్రమాదం ఉంది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ సినిమాని కంటెంపరరీ మార్కెట్ టెస్ట్‌గా చూస్తోంది. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ నుంచి ఓ పక్క హాలీవుడ్ టచ్ తో కూడిన ఇండియన్ మాస్ ట్రీట్ మిస్ అవ్వదనే నమ్మకంతోనే మేకర్స్ దూకుడు మీదున్నారు.
మొత్తం మీద, ‘AA22 X A6’ ఫస్ట్ అప్డేట్ నుంచే హైప్ తారాస్థాయిలో ఉంది. కాని బాక్సాఫీస్ వద్ద 1600 కోట్ల టార్గెట్ అంటే మాటలు కాదు. ఇది నేరుగా ఇండియన్ సినిమా రేంజ్‌ను డిఫైన్ చేసే మూవీ కావొచ్చు. ఫాన్స్ అంచనాలు అట్టహాసంగా ఉన్నా.. చివరికి కంటెంట్ క్లిక్కవ్వాలి. మరి అట్లీ, బన్నీ అంచనాల్ని నిజం చేస్తారా? లేక ఇది హై బడ్జెట్ రిస్క్ గా మిగిలిపోతుందా? అనేది సమయం మాత్రమే చెప్తుంది.