బన్నీని అట్లీ సూపర్ హీరోని చేస్తున్నాడా?
`ఫుష్ప 2` వివాదం ఏ క్షణాన మొదలైందోకానీ ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.;

`ఫుష్ప 2` వివాదం ఏ క్షణాన మొదలైందోకానీ ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. `ఫుష్ప 2` బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా ఏకంగా `RRR` వసూళ్లని అధిగమించి `కేజీఎఫ్ చాప్టర్ 2` రికార్డులని సమయం చేసే వరకు వెళ్లింది. దీంతో ఈ సినిమా తరువాత బన్నీ ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడో అనే చర్చ దేశ వ్యాప్తంగా సినీ లవర్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ ప్రాజెక్ట్‌తో తన పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
`AA22xA6` అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన ఈ సినిమాని కోలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ కంపనీ సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మంగా నిర్మించబోతోంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో `కూలీ`, త్వరలో `జైలర్ 2`ని నిర్మిస్తున్న `కళానిధిమారన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. మంగళవారం విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినీ లవర్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఈ వీడియోలోని విజువల్స్ చూస్తుంటే బన్నీ, అట్లీల కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ అంత ఆశామాషీ ప్రాజెక్ట్ కాదని, భారతీయ సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేలా ఉందని స్పష్టమవుతోంది.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ అమెరికాలోని పాపులర్ వీఎఫ్ ఎక్స్ థియేటర్లకు వెళ్లడం అక్కడ కామిక్ క్యారెక్టర్లు, సూపర్ హీరో తరహా క్యారెక్టర్ల ముందు ఫొటోలకు పోజులిచ్చిన దృశ్యాలు ఈ ప్రాజెక్ట్‌పై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఈ సినిమాకు `అవతార్`, ఐరన్‌మ్యాన్, ట్రాన్స్ ఫార్మర్స్, అవెంజర్స్ వంటి వరల్డ్ ఫేమస్ మూవీకి గ్రాఫిక్స్ అందించిన అంతర్జాతీయ నిపుణులు పనిచేయనున్నట్టుగా తెలుస్తోంది. అట్లీ చెప్పిన స్టోరీలైన్ మామూలుగా లేదని, ఈ సినిమా అందిరిని ఆశ్చర్యపరచడం ఖాయమని గ్రాఫిక్స్ నిపుణులు చెప్పడం విశేషం.
బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అట్లీతో కలిసి బన్నీ లాస్ ఏంజిల్స్‌లోని లోలా వీఎఫ్ ఎక్స్ కంపనీరి వెళ్లారు. తమ సినిమా గురించి వారికి వివరించారు. అంతే కాకుండా ఇది హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంటుదని, ఆ స్థాయిలో గ్రాఫిక్స్ చేయాలని వివరించారు. ఈ సందర్భంగా బన్నీ అవతార్ తరహా మాస్క్ క్యాప్ ధరించి బిగ్గరగా అరవడం, ఖడ్గాన్ని ప్రత్యేకంగా చూపించడంతో ఈ సినిమాలో బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్‌లో కనిపించి మెస్మరైజ్ చేయబోతున్నాడనే టాక్ మొదలైంది.
సరికొత్త నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో నెవర్ బిఫోర్ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండనుంది? ..ఎప్పుడు సెట్స్‌పైకి రానుందన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దీని తరువాతే బన్నీ `పుష్ప 3`తో పాటు త్రివిక్రమ్ పీరియాడిక్ డ్రామాని సెట్స్‌పైకి తీసుకెళ్తారట.