600 కోట్లతో AA కాంబో మూవీ..?

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయాల్సి ఉన్నా అది ఇంకాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.

Update: 2025-02-28 02:30 GMT

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయాల్సి ఉన్నా అది ఇంకాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. అందుకే ఈలోగా అట్లీతో సినిమా పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గా అట్లీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. షారుఖ్ తో జవాన్ తర్వాత అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే సినిమా చేస్తాడని దాదాపు ఫిక్స్ అయ్యింది.

ఐతే ఈ సినిమా బడ్జెట్ ఇంకా రెమ్యునరేషన్ లెక్కలు ఆడియన్స్ కు షాక్ ఇస్తున్నాయి. పుష్ప 2 తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు కాబట్టి నెక్స్ట్ సినిమా దాన్ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే అట్లీ సినిమా విషయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్, అట్లీ ఈ AA కాంబినేషన్ సినిమా బడ్జెట్ కూడా 600 కోట్ల దాకా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. 500 కోట్ల నుంచి 600 కోట్ల పైనే అంటున్నారు.

అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. మొన్నటిదాకా నేషనల్ లెవెల్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే అది ప్రభాస్ ఒక్కడికే అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ని దాటి అల్లు అర్జున్ ఏకంగా 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అట్లీ కూడా ఈ సినిమాకు 100 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మొత్తంగా అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాకు రెమ్యూనరేషన్ రూపంలోనే సగం బడ్జెట్ వెళ్తుందని తెలుస్తుంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. మరి జవాన్ తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ చేయబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ సినిమా విషయంలో అల్లు ఫ్యాన్స్ మాత్రం తారాస్థాయి అంచనాలతో ఉన్నారు.

Tags:    

Similar News