అల్లు అర్జున్ కోసం మైండ్ బ్లాక్ అయ్యే స్టోరి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` తర్వాత గ్యాప్ తీసుకున్నారు. తదుపరి అట్లీతో భారీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.;

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` తర్వాత గ్యాప్ తీసుకున్నారు. తదుపరి అట్లీతో భారీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు దళపతి విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో అట్లీ ఇప్పుడు బన్నిపైనే ఫోకస్ చేసాడు. అయితే ఈ కాంబినేషన్ ఎలాంటి కథతో సెట్స్ పైకి వెళుతున్నారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కోసం అట్లీ భారీ యాక్షన్ స్టోరిని ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందనుంది. ఇందులో అల్లు అర్జున్ మాఫియా డాన్‌గా నటిస్తారని టాక్. మోస్ట్ పవర్‌ఫుల్ స్క్రిప్టును అట్లీ రెడీ చేస్తున్నారు. ఇందులో డాన్ ని ఎదుర్కొనే ధీటైన పోలీస్ అధికారి పాత్ర కూడా ఉంటుందట. ముఖ్యంగా ఎంపిక చేసుకున్న మాఫియా కథాంశం మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని కూడా భరోసా ఇస్తున్నారు.
అయితే అట్లీ మాఫియా కథను ఎంచుకోవడం చాలా రిస్కుతో కూడుకున్న పని. కేజీఎఫ్ ఫ్రాంఛైజీలా... షారూఖ్ ఖాన్ డాన్ తరహాలో ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. అయితే వెండితెరపై డాన్ పాత్రలు కొత్తేమీ కాదు. అట్లీ ఇప్పటివరకూ ఎవరూ చూడని డాన్ ని పెద్ద తెరపై చూపించాల్సి ఉంటుంది. అట్లీతో సినిమా పూర్తయాక, త్రివిక్రమ్ తో మూవీలో బన్ని నటిస్తాడు. ఆ తర్వాత పుష్ప 3 చిత్రీకరణ ప్రారంభమవుతుందని మైత్రి రవిశంకర్ చెప్పుకొచ్చారు.