అర్జున్, అట్లీ మూవీ... హీరోయిన్ గురించి మరో పుకారు
పుష్ప 2 తో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాను అట్లీతో చేసేందుకు సిద్ధం అయ్యాడు.;

పుష్ప 2 తో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాను అట్లీతో చేసేందుకు సిద్ధం అయ్యాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో రూపొందించిన జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించిన జవాన్ సినిమాతో అట్లీ స్థాయి, క్రేజ్ మరింత పెరిగింది. అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరూ గత చిత్రాలతో దేశ వ్యాప్తంగా రికార్డ్‌లను బ్రేక్ చేశారు. ముఖ్యంగా నార్త్ ఇండియాను వారు తమ సినిమాలతో షేక్ చేసిన విషయం తెల్సిందే. అందుకే అట్లీ, అల్లు అర్జున్ కాంబో సినిమా అనగానే దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాకు సదరు బ్యానర్ వారు ఏకంగా రూ.800 కోట్లను ఖర్చు చేయబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అల్లు అర్జున్‌కి రూ.250 కోట్లు, అట్లీకి రూ.150 కోట్ల పారితోషికం కాగా, ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులకు మరో రూ.150 కోట్ల పారితోషికంను ఇవ్వబోతున్నారు. మొత్తంగా సినిమాకు వర్క్ చేయబోతున్న వారికి దాదాపుగా రూ.550 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారు. మిగిలిన మొత్తంతో సినిమా మేకింగ్ చేయబోతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్స్ ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ వరల్డ్ క్లాస్ రేంజ్‌లో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. ఆమెను అట్లీ సంప్రదించారని, అడ్వాన్స్ సైతం ఇచ్చారని టాక్ వచ్చింది. ఇంకా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ మాత్రం రాలేదు.
అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ కోసం హీరోయిన్ ఎంపిక విషయమై రోజుకో వార్త సోషల్ మీడియాలో పుకారు చేస్తోంది. ఈ మధ్య కాలంలో పలువురి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తుంది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా దిశా పటానీ సుపరిచితురాలు. తెలుగు, తమిళంలో ఆమె నటించిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తెలుగు, తమిళ ప్రేక్షకులకు దిశా పరిచయం ఉంది. కనుక అల్లు అర్జున్ సినిమా కు ఆమెను ఒక హీరోయిన్‌గా అట్లీ ఫిక్స్ చేశాడని సమాచారం అందుతోంది. హీరోయిన్స్ విషయమై ఇప్పటి వరకు చాలా పుకార్లు వచ్చాయి. మరి వాటిల్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.